Mysore Queen Promoda Devi: తిరుమల శ్రీవారికి 50కిలోల వెండి అఖండ దీపాలు
ABN, Publish Date - May 20 , 2025 | 06:28 AM
తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత ప్రమోదా దేవి 50 కిలోల బరువు ఉన్న రెండు వెండి అఖండ దీపాలను విరాళంగా అందజేశారు. 300 ఏళ్ల క్రితం మైసూరు మహారాజు సమర్పించిన దీపాలు పాడైపోవడంతో, వాటి స్థానంలో ఈ కొత్త దీపాలను అందించారు.
విరాళంగా అందజేసిన మైసూరు రాజమాత
300 ఏళ్ల క్రితం అందించిన మైసూరు మహారాజు
పాడైపోవడంతో మళ్లీ ఇచ్చిన ప్రమోదా దేవి
తిరుమల, మే19(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత ప్రమోదా దేవి రెండు భారీ వెండి అఖండ దీపాలను సోమవారం విరాళంగా అందజేశారు. 300 ఏళ్ల కిందట అప్పటి మైసూరు మహారాజు స్వామికి సమర్పించిన అఖండదీపాలు పాడైపోవడంతో, వాటి స్థానంలో 50 కిలోల బరువుండే వెండి దీపాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో అందజేశారు. దర్శనం అనంతరం ప్రమోదాదేవితో పాటు యదువర్ కృష్ణదత్త చామరాజు ఒడయార్ ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. దేవదాయశాఖ కమిషనర్, ఆలయ అధికారులు నాలుగు నెలల కిందట మైసూరు ప్యాలె్‌సకు వచ్చి పాత అఖండదీపాలు పాడైపోయిన విషయం చెప్పారన్నారు. స్వామికి సేవ చేసుకోవడంలో భాగంగా తమ పూర్వీకుల ఆచారాన్ని కొనసాగించడానికి ఈ దీపాలను తిరిగి అందించామని చెప్పారు.
Updated Date - May 20 , 2025 | 06:29 AM