Operation Garuda: తిరుమలలో ఆపరేషన్ గరుడ
ABN, Publish Date - May 11 , 2025 | 04:45 AM
తిరుమల యాత్రికుల వసతి సముదాయంలో ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో ఆక్టోపస్ బలగాలు ఉగ్రవాద దాడులకు సమాధానంగా మాక్‌డ్రిల్ నిర్వహించాయి. భక్తుల రక్షణ కోసం ఉగ్రవాదులను ఎలా ఎదుర్కోవాలో శిక్షణ ఇచ్చారు.
యాత్రికుల వసతి సముదాయంలో ఆక్టోపస్ మాక్‌డ్రిల్
తిరుమల, మే 10(ఆంధ్రజ్యోతి): తిరుమలలో సామాన్యులు బస చేసే యాత్రికుల వసతి సముదాయం-3(పీఏసీ)లో ఆక్టోపస్ బలగాలు శనివారం ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో మాక్‌డ్రిల్‌ను నిర్వహించాయి. అనుకోకుండా ఉగ్రవాదులు భక్తులను బంధి స్తే వారిని ఎలా రక్షించాలి, ఉగ్రవాదులను ఎలా అంతమొందించాలనే అంశాలపై అవగాహనకు ఈ మాక్‌డ్రిల్ నిర్వహించారు. ముందుగా ఉగ్రవాదుల వేషధారణలో నలుగురు ‘పాకిస్థాన్ జిందాబాద్, జీహాద్’ అం టూ ఆయుధాలతో భవనంలోకి ప్రవేశించారు. వెంటనే విజిలెన్స్ సిబ్బంది ఆక్టోపస్ బేస్‌క్యాం్‌పకు సమాచారమిచ్చారు. వారు ఆయుధాలతో ఘటనాప్రాంతానికి చేరుకున్నారు. ముందుగా భవనం బ్లూప్రింట్‌ను పరిశీలించి బృందాలుగా విడిపోయారు. భవనం వెనుకభాగం నుంచి 2 బృందాలు, ముందు నుంచి మరో బృందం భవనంలోకి ప్రవేశించాయి. క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ముందుకు సాగిన క్రమంలో 3 హాళ్లలో నక్కి ఉన్న ఉగ్రవాదులను అంతం చేశారు. సుమారు గంటన్నరపాటు ఈ డ్రిల్‌ను నిర్వహించారు.
Updated Date - May 11 , 2025 | 04:45 AM