ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kadiri: ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న కారు

ABN, Publish Date - May 12 , 2025 | 04:55 AM

శ్రీసత్యసాయి జిల్లా పెద్దయల్లంపల్లి వద్ద ఆగి ఉన్న వ్యాన్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు

  • ముగ్గురి దుర్మరణం.. ఒకరికి తీవ్రగాయాలు.. మృతులంతా అన్నదమ్ములే

కదిరి, మే 11(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం పెద్దయల్లంపల్లి సమీపంలో ఆదివారం ఆగి ఉన్న వ్యాన్‌ను వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు కదిరి వైపు నుంచి మదనపల్లి వైపు వెళ్తున్న వ్యాన్‌ను ఆదివారం వేకువజామున లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దెబ్బతిన్న వ్యాన్‌ను రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన అన్నదమ్ములు నాగేంద్ర(63), చలపతి(75), జయచంద్ర(70), వారి బంధువు, నెల్లూరుకు చెందిన వేణుగోపాల్‌.. అనంతపురంలో బంధువు అంత్య క్రియలకు హాజరై వస్తుండగా ఆదివారం సాయంత్రం వారి కారు పెద్దయల్లంపల్లి వద్ద అదుపు తప్పి, ఆగి ఉన్న వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేంద్ర, చలపతి, జయచంద్ర, వేణుగోపాల్‌ అక్కడికక్కడే మృతి చెందగా, వేణుగోపాల్‌ తీవ్రంగా గాయపడ్డారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కదిరి రూరల్‌ సీఐ నాగేంద్ర తెలిపారు.

Updated Date - May 12 , 2025 | 06:06 AM