Thopudurthi Returns: అజ్ఞాతం వీడిన తోపుదుర్తి
ABN, Publish Date - May 08 , 2025 | 04:48 AM
కుంటిమద్ది హెలిప్యాడ్ కేసులో అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అనంతపురానికి తిరిగి వచ్చారు. పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి విచారణకు హాజరు కావాలని నోటీసులు అందజేశారు
పుట్టపర్తి, మే 7(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అజ్ఞాతం వీడారు. కుంటిమద్ది హెలిప్యాడ్ కేసులో అరెస్టు భయంతో ఊరు విడిచిన ఆయన.. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అనంతపురానికి బుధవారం తిరిగి వచ్చారు. చెన్నేకొత్తపల్లి ఎస్‌ఐ సత్యనాయణ అనంతపురంలో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఇంటికి వెళ్లి బుధవారం నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12లోపు రామగిరి సర్కిల్ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Updated Date - May 08 , 2025 | 04:48 AM