ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Supplementary Results: టెన్త్‌ సప్లిమెంటరీలో 76.14 శాతం ఉత్తీర్ణత

ABN, Publish Date - Jun 13 , 2025 | 04:42 AM

పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో 76.14 శాతం మంది ఉతీర్ణత సాధించారు. సప్లిమెంటరీ పరీక్షలకు 1,23,477 మంది హాజరు కాగా, 94,017 మంది ఉత్తీర్ణులయ్యారు.

  • టెన్త్‌ సప్లిమెంటరీలో 76.14 శాతం ఉత్తీర్ణత

  • అబ్బాయిలు 73.55 శాతం... అమ్మాయిలు 80.10 శాతం

అమరావతి, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో 76.14 శాతం మంది ఉతీర్ణత సాధించారు. సప్లిమెంటరీ పరీక్షలకు 1,23,477 మంది హాజరు కాగా, 94,017 మంది ఉత్తీర్ణులయ్యారు. గురువారం ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులురెడ్డి ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలకు అబ్బాయిలు 74,702 మంది హాజరు కాగా, 54,946 మంది (73.55శాతం), అమ్మాయిలు 48,755 మందికిగాను 39,071 మంది(80.1శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 98.24శాతం, పశ్చిమగోదావరిలో అత్యల్పంగా 50.24 శాతం ఉతీర్ణత నమోదైంది. ఈ నెల 13 నుంచి 19 వరకు రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని డైరెక్టర్‌ తెలిపారు. ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ద్వారా 15,422 మంది టెన్త్‌ పరీక్షలు రాయగా 10296 మంది, 27,123 మంది ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాయగా 18,099 మంది ఉత్తీర్ణత సాధించారు.

Updated Date - Jun 13 , 2025 | 04:45 AM