Water Resources Analyst: నదీ జలాల కేటాయింపులపై తెలంగాణ నేతల మాటలన్నీ అబద్ధాలే
ABN, Publish Date - Jul 04 , 2025 | 06:01 AM
నదీ జలాల కేటాయింపులపై తెలంగాణ నేతల మాటలన్నీ అబద్దాలేనని జల వనరుల విశ్లేషకుడు టి.లక్ష్మీనారాయణ విమర్శించారు. నీటి కేటాయింపులపై తెలంగాణ మాజీ మంత్రి హరీశ్‌రావు చేస్తున్న వ్యాఖ్యలన్నీ తప్పేనని ఆయన స్పష్టం చేశారు.
ప్రాజెక్టుల వారీ గణాంకాలపై తెలంగాణ గడ్డపైనైనా మాట్లాడతా
పోలవరం - బనకచర్లను గోదావరి - సోమశిలగా మార్చాలి
జల వనరుల విశ్లేషకుడు టి.లక్ష్మీనారాయణ సూచన
అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): నదీ జలాల కేటాయింపులపై తెలంగాణ నేతల మాటలన్నీ అబద్దాలేనని జల వనరుల విశ్లేషకుడు టి.లక్ష్మీనారాయణ విమర్శించారు. నీటి కేటాయింపులపై తెలంగాణ మాజీ మంత్రి హరీశ్‌రావు చేస్తున్న వ్యాఖ్యలన్నీ తప్పేనని ఆయన స్పష్టం చేశారు. ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డితో సహా.. అక్కడి ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతున్న ప్రాజెక్టుల వారీ గణాంకాలపై తెలంగాణ గడ్డపైనైనా మాట్లాడతానని తేల్చి చెప్పారు. గోదావరి వరద జలాలను ఏపీ స్వేచ్ఛగా వాడుకోవచ్చని ట్రిబ్యునల్ ఆదేశించిందని వెల్లడించారు. పోలవరం - బనకచర్ల అనుసంధానాన్ని జాతీయ నదుల అనుసంధాన పథకంలో చేర్చి, గోదావరి - సోమశిలగా మార్చాలని లక్ష్మీనారాయణ సూచించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం నాడు ఆలోచనాపరుల వేదిక తరఫున వ్యవసాయరంగ నిపుణుడు అక్కినేని భవానీ ప్రసాద్‌తో కలసి లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. ఏపీకి అన్యాయం చేసేలా తెలంగాణ నేతల మాట్లాడుతుంటే.. కూటమి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పొరుగు రాష్ట్రాలైన ఒడిసా, ఛత్తీస్‌గఢ్లు సుప్రీం కోర్టులో కేసులు వేసినందున.. పోలవరం- బనకచర్లపై కేంద్ర పర్యావరణ శాఖ తీసుకున్న నిర్ణయం సహేతుకమైనదేనని అన్నారు.
Updated Date - Jul 04 , 2025 | 06:07 AM