APTF: రేషనలైజేషన్ పాయింట్లపై పరిమితులు ఎత్తివేయాలి
ABN, Publish Date - May 12 , 2025 | 04:55 AM
ఏపీటీఎఫ్-అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్ రేషనలైజేషన్ పాయింట్లపై ఉన్న పరిమితులను ఎత్తివేయాలని కోరారు. 2023లో రేషనలైజేషన్ పొందిన టీచర్లకు పాయింట్ల విషయంలో న్యాయం చేయాలని మన్నం శ్రీనివాస్ తెలిపారు
అమరావతి, మే 11(ఆంధ్రజ్యోతి): టీచర్లకు రేషనలైజేషన్ పాయింట్లపై ఉన్న పరిమితులను ఎత్తివేయాలని ఏపీటీఎఫ్-అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్ కోరారు. పాత పాయింట్లకు రేషనలైజేషన్ పాయింట్లు కలపాలని, తొమ్మిది నెలలు దాటిన కాలాన్ని ఒక సంవత్సరంగా పరిగణించాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రేషనలైజేషన్‌కు గురైన వారికి రేషనలైజేషన్ పాయింట్లతో పాటు పాత స్టేషన్ పాయింట్లు కూడా ఇవ్వాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్ కోరారు. 2023లో వేలాది మంది టీచర్లు రేషనలైజేషన్‌కు గురయ్యారని, రెండేళ్లు కూడా గడవకుండా మళ్లీ రేషనలైజేషన్‌కు గురవుతున్నారని వారికి పాయింట్ల విషయంలో న్యాయం చేయాలన్నారు.
Updated Date - May 12 , 2025 | 04:55 AM