TDP: మహానాడు మూడు రోజులు
ABN, Publish Date - May 15 , 2025 | 03:29 AM
తెలుగుదేశం పార్టీ మూడు రోజుల పాటు మహానాడును నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా పార్టీ విధివిధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు, తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి.
నిర్వహణ కమిటీలతో లోకేశ్ భేటీ
అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ మహానాడును మూడు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం నిర్వహణకు ఇప్పటికే ఆరు కమిటీలు ఏర్పాటు చేశారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొలిట్‌బ్యూరో సమావేశానికి ముందు మహానాడు కమిటీల కన్వీనర్లు, కో-కన్వీనర్లతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ సమవేశమయ్యారు. ఈ సందర్భంగా మహానాడును కుదించకుండా మూడు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. మొదటి రోజు టీడీపీ విధివిధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై చర్చించాలని, రెండోరోజు రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలపై చర్చించాలని నిర్ణయించారు మూడోరోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు మహానాడు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో మహానాడు నిర్వహణపైనా సమావేశంలో చర్చించారు. మహానాడు నిర్వహణలో.. వసతి, రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నేతలకు లోకేశ్ దిశానిర్దేశం చేశారు. మహానాడు ఏర్పాట్లపై లోకేశ్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ పొలిట్‌బ్యూరో సమావేశంలో నివేదిక సమర్పించింది. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, సవిత, పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయస్వామి, సీనియర్ నాయకుడు బీద రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News
Updated Date - May 15 , 2025 | 03:29 AM