ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TDP Mahanadu: టీడీపీ మహానాడుకు శ్రీకారం

ABN, Publish Date - May 05 , 2025 | 04:03 AM

కడప జిల్లా చింతకొమ్మదిన్నెలో టీడీపీ మహానాడు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27-29 తేదీల్లో జరిగే ఈ సభకు భారీగా కార్యకర్తలు హాజరవనున్నారు.

  • ఈ నెల 27-29 వరకు పసుపు పండుగ

  • కడపలోని కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్నెలో ఏర్పాట్లు ప్రారంభం

  • టెంకాయ కొట్టి భూమి చదును పనులు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ నేతలు

సీకేదిన్నె, మే 4(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ’మహానాడు’కు ఆ పార్టీ నాయకులు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది మహానాడును కడప జిల్లా, కమలాపురం నియోజకవర్గంలోని చింతకొమ్మదిన్నె పరిధిలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మహానాడు ప్రాంగణంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌. శ్రీనివాసరెడ్డిల ఆధ్వర్యంలో ఆదివారం పనులను ప్రారంభించారు. మహానాడుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి లక్షలాదిగా కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంది. దానిని దృష్టిలో ఉంచుకుని సభా ప్రాంగణం, ఇతర ఏర్పాట్లను దాదాపు 20 రోజుల ముందుగానే ప్రారంభించారు.


చింతకొమ్మదిన్నె మండలంలోని చెర్లోపల్లె పొలంలో రింగ్‌ రోడ్డుకు ఆనుకుని ఉన్న 120 ఎకరాల్లో స్థలాన్ని చదును చేసే పనులు మొదలుపెట్టారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ ్నల్‌ ఇవ్వడంతో ఇంతవరకు స్థల పరిశీలన కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, స్థలం ఎంపిక పూర్తి కావడంతో సభావేదిక, భోజనశాలలు తదితర అవసరాల నిమిత్తం 120 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక నాయకుల సహకారంతో పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే చైతన్యరెడ్డి రంగంలోకి దిగారు. కడప జిల్లాలో తొలిసారి నిర్వహిస్తున్న మహానాడును దిగ్విజయం చేసేందుకు నాయకులు కలసికట్టుగా ముందుకు సాగుతున్నారు.


అందరికీ అనుకూల ప్రదేశం

మహానాడుకు ఎంపిక చేసిన స్థలం అందరికీ అనుకూలమైన ప్రదేశంగా భావిస్తున్నారు. కడప నగరానికి 10 కిలోమీటర్ల లోపు ఉంది. రింగ్‌ రోడ్డులో వాహనాల పార్కింగ్‌కు, దాదాపు 25-30 వేల వరకు వచ్చే ప్రతినిధులకు బస ఏర్పాటు చేసేందుకు కూడా సమీపంలో కల్యాణ మండపాలు, విద్యాసంస్థలు ఉండడంతో అనుకూలంగా ఉంటుందని నాయకులు భావిస్తున్నారు. రవాణా శాఖ కార్యాలయం సమీపంలో.. పులివెందుల రోడ్డు సాక్షి సర్కిల్‌ వద్ద, ఇతర ప్రదేశాల్లో పార్కింగ్‌ కోసం స్థలాలను పరిశీలించి ఎటువైపు నుంచి వచ్చే వాహనాలను అటువైపే పార్కింగ్‌ చేసి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూ సేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - May 05 , 2025 | 05:29 AM