ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: పెద్దిరెడ్డికి సుప్రీంలో చుక్కెదురు

ABN, Publish Date - Jun 24 , 2025 | 06:44 AM

మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బుగ్గమఠం భూముల వ్యవహారంలో ఆయనకు ఊరట లభించలేదు.

  • బుగ్గమఠం భూముల వ్యవహారంలో దక్కని ఊరట

  • హైకోర్టు బెంచ్‌ నిర్ణయం తీసుకుంటుందన్న కోర్టు

  • ఆ భూములపై 2 వారాలు యథాతథ స్థితికి ఆదేశం

న్యూఢిల్లీ, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బుగ్గమఠం భూముల వ్యవహారంలో ఆయనకు ఊరట లభించలేదు. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో విచారణ పెండింగ్‌లో ఉండగా.. మెరిట్స్‌లోకి వెళ్లలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. తిరుపతి నగరంలోని ఎమ్మార్‌ పల్లి పరిధి సర్వే నంబరు 261/1లో 1.50 ఎకరాలు, 261/2లో 2.38 ఎకరాలు (మొత్తం 3.88 ఎకరాలు) బుగ్గమఠానికి చెందిన భూములను పెద్దిరెడ్డి ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, వాటిని పది రోజుల్లో ఖాళీ చేయాలని పేర్కొంటూ మఠం ఈవో/దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఉత్తర్వులిచ్చారు. వీటిని సవాల్‌ చేస్తూ పెద్దిరెడ్డి హైకోర్టుకు వెళ్లగా.. ఆ 3.88 ఎకరాల ఆక్రమిత భూమిని ఖాళీ చేయాలని, అందులో నిర్మాణాలను తొలగించాలంటూ ఈవో/అసిస్టెంట్‌ కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరముంటే దేవదాయ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఉత్తర్వులు ఇచ్చింది.

ఆ ఉత్తర్వులను ఆయన డివిజన్‌ బెంచ్‌లో అప్పీలు చేశారు. వేసవి సెలవుల తర్వాత విచారిస్తామని డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సింగిల్‌ జడ్జి బెంచ్‌ తీర్పును గతనెల 28న పెద్దిరెడ్డి సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆ పిటిషన్‌పై సోమవారం జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌, జస్టిస్‌ ఎన్‌ కోటీశ్వర్‌సింగ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పెద్దిరెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది మణీందర్‌ సింగ్‌, రాష్ట్రప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. అనంతరం.. బుగ్గమఠం భూముల వ్యవహారంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్‌పై డివిజన్‌ బెంచ్‌ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. కేసు మెరిట్స్‌లోకి తాము వెళ్లడం లేదని తెలిపింది. రెండు వారాల పాటు ఆ భూములపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ హైకోర్టుకు ఉంటుందని స్పష్టంచేసింది. పిటిషన్‌పై విచారణను ముగించింది.

Updated Date - Jun 24 , 2025 | 05:47 PM