SSC supplementary exams: టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల
ABN, Publish Date - May 13 , 2025 | 04:35 AM
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు వెబ్‌సైట్ లేదా వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ ప్రకటించింది. ఈ పరీక్షలు మే 19 నుంచి 28వ తేదీ వరకు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయి.
అమరావతి, మే 12 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఠీఠీఠీ.ఛట్ఛ.్చఞ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్ ద్వారా స్కూల్ లాగిన్ లేదా వ్యక్తిగత లాగిన్‌తో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ నంబరు 9552300009 ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఈనెల 19 నుంచి 28 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..
Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల
Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ
For AndhraPradesh News And Telugu News
Updated Date - May 13 , 2025 | 04:35 AM