Simhachalam Funeral: అధికార లాంఛనాలతో సింహాచలం అంత్యక్రియలు
ABN, Publish Date - Jun 09 , 2025 | 05:24 AM
విశాఖ-2 నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం అంత్యక్రియలు ఆదివారం ఉదయం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. గాజువాక హైస్కూలు రోడ్డులోని...
విశాఖపట్నం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): విశాఖ-2 నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం అంత్యక్రియలు ఆదివారం ఉదయం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. గాజువాక హైస్కూలు రోడ్డులోని శ్మశానవాటికలో నిర్వహించిన అంత్యక్రియల్లో పెద్ద కుమారుడు శంకరరావు తండ్రి చితికి నిప్పు అంటించారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అంతకు ముందు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు, కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు సింహాచలం పార్థివదేహం వద్ద నివాళులర్పించారు.
Updated Date - Jun 09 , 2025 | 05:25 AM