ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Shining Stars Awards 2025: నేడు షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులు

ABN, Publish Date - Jun 09 , 2025 | 03:39 AM

టెన్త్‌, ఇంటర్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులను ప్రోత్సహించడానికి షైనింగ్‌ స్టార్స్‌ అవార్డు-2025 పేరిట సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, పార్వతీపురంలో...

  • టెన్త్‌, ఇంటర్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రదానం

  • పార్వతీపురంలో పాల్గొననున్న విద్యామంత్రి లోకేశ్‌

అమరావతి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): టెన్త్‌, ఇంటర్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులను ప్రోత్సహించడానికి షైనింగ్‌ స్టార్స్‌ అవార్డు-2025 పేరిట సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, పార్వతీపురంలో విద్యా మంత్రి లోకేశ్‌ పాల్గొంటారు. విద్యలో నాణ్యత, నైపుణ్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 4,168 మంది టెన్త్‌ విద్యార్థులకు, ప్రభుత్వ, ప్రైవేట్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంఈసీ, ఒకేషనల్‌ విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించిన 920 మంది ఇంటర్‌ విద్యార్థులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, ఓసీ, పీహెచ్‌ విభాగాల నుంచి అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారు. ప్రతి అవార్డు గ్రహీతను పతకం, రూ.20 వేల నగదు బహుమతి, సర్టిఫికెట్‌తో సత్కరించనున్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌ 15న రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచిన 52 మంది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులను మంత్రి లోకేశ్‌ ఉండవల్లిలోని నివాసంలో సత్కరించారు.

Updated Date - Jun 09 , 2025 | 03:41 AM