SPY Agro Industries: సజ్జల శ్రీధర్‌రెడ్డితో మాకు సంబంధం లేదు
ABN, Publish Date - Apr 28 , 2025 | 03:30 AM
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన సజ్జల శ్రీధర్‌రెడ్డితో తమ కంపెనీకి 2022 నుంచి ఎలాంటి సంబంధం లేదని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. ఆయన ప్రస్తుతం షేర్‌హోల్డర్ గానీ, డైరెక్టర్ గానీ లేరని తెలిపింది
2022లో ఆయన డైరెక్టర్ హోదా ముగిసింది: ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్
కర్నూలు, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన సజ్జల శ్రీధర్‌రెడ్డితో ప్రస్తుతం తమ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని నంద్యాలకు చెందిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేర్కొంది. శ్రీధరరెడ్డి గతంలో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్‌గా పని చేశారని, అయితే 2022 జనవరిలో ఆయన డైరెక్టర్ హోదా ముగిసిందని ఒక ప్రకటనలో తెలిపింది. నాటి నుంచి ఆయన కంపెనీలో షేర్‌హోల్డర్ కాదని, సంతకం చేసే పాత్ర లేదని వెల్లడించింది. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డితో శ్రీధర్‌రెడ్డికి ఉన్న అనుబంధం ఆయన వ్యక్తిగతమని పేర్కొంది.
Updated Date - Apr 28 , 2025 | 03:30 AM