Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల బదిలీలపై పునరాలోచించండి
ABN, Publish Date - Jun 23 , 2025 | 02:56 AM
గ్రామవార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు సొంత మండలాలు, వార్డు నుంచి వార్డుకు బదిలీలు చేసే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు.
విజయవాడ, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ప్రమోషన్ చానల్స్, రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని ఏపీ వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీస్ జేఏసీ చైర్మన్ బి.గంటయ్య ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామవార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు సొంత మండలాలు, వార్డు నుంచి వార్డుకు బదిలీలు చేసే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు.
Updated Date - Jun 23 , 2025 | 02:56 AM