CPI Rama Krishna: ప్రధాని తొలిసారి మట్టి రెండోసారి చాక్లెట్ ఇచ్చారు
ABN, Publish Date - May 07 , 2025 | 07:09 AM
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతవరకూ తాడేపల్లి పంటలను పరిశీలించలేదని విమర్శించారు. రైతుల నష్టాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
దెబ్బతిన్న పంటలను ఇప్పటికీ పరిశీలించని అధికారులు: రామకృష్ణ
తాడేపల్లి టౌన్, మే 6(ఆంధ్రజ్యోతి): ‘సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో ఈ నెల 2న పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేసి ప్రధాన మంత్రిని పిలిచారు. తొలిసారి మోదీ వచ్చినప్పుడు ముంత మట్టి, చెంబు నీరు తీసుకొచ్చారు. ఈసారి చాక్లెట్ ఏదో తీసుకొచ్చారు. నోరు తీయగా ఉంటుందని చెప్పి వెళ్లారు’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి తాడేపల్లిలో దెబ్బ తిన్న పంటలను ఆయన పరిశీలించారు. సీఎం నివాసం ఉంటున్న తాడేపల్లిలోనే ఇంతవరకు దెబ్బతిన్న పంటలను పరిశీలించలేదని, ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
Updated Date - May 07 , 2025 | 07:09 AM