ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Quantum Technology: ఇంజనీరింగ్‌లో క్వాంటమ్‌ డిగ్రీ

ABN, Publish Date - Jun 23 , 2025 | 04:04 AM

ఉన్నత విద్యలో క్వాంటమ్‌ టెక్నాలజీ సిలబ్‌సను ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

  • ఉన్నత విద్యామండలి నిర్ణయం

అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యలో క్వాంటమ్‌ టెక్నాలజీ సిలబ్‌సను ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీనిపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఆదివారం మంగళగిరిలో సమావేశమైంది. ఇంజనీరింగ్‌, డిగ్రీ కోర్సుల్లో వేర్వేరుగా క్వాంటమ్‌ టెక్నాలజీ సిలబ్‌సను ప్రవేశపెట్టాలని కమిటీ నిర్ణయానికి వచ్చింది. ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఇంజనీరింగ్‌ స్ర్టీమ్‌లో 18 క్రెడిట్లతో మైనర్‌ డిగ్రీ ఇస్తారు. ఇంజనీరింగ్‌ అండ్‌ జనరల్‌ స్ర్టీమ్‌లో కృత్రిమ మేధతో కలిపి 18 క్రెడిట్లతో మైనర్‌ డిగ్రీ ఉంటుంది. ఈ రెండు డిగ్రీలు సాధారణ డిగ్రీలకు అనుసంధానంగా ఉంటాయి.

అదే సాధారణ డిగ్రీ విద్యార్థులకు అయితే 16 క్రెడిట్లతో క్వాంటమ్‌ టెక్నాలజీ సబ్జెక్టు మైనర్‌గా ఉంటుంది. వారికి డిగ్రీలోనే క్వాంటమ్‌ టెక్నాలజీ ఉంటుంది. దీనికోసం ఫిజిక్స్‌, ఎలక్ర్టానిక్స్‌, గణితం, కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టుల బోధనా సిబ్బందికి అవగాహన కల్పిస్తారు. ప్రముఖ ఐటీ కంపెనీలు టీసీఎస్‌, ఐబీఎంల సహకారంతో ఐఐటీల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆంధ్రా, జేఎన్‌టీయూ కాకినాడ, నాగార్జున, శ్రీవెంకటేశ్వర, జేఎన్‌టీయూ అనంతపురం, ఆర్జీయూకేటీల్లో క్వాంటమ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Jun 23 , 2025 | 04:08 AM