CM Chandrababu Naidu: మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యం ఫరూక్
ABN, Publish Date - Jun 26 , 2025 | 06:42 AM
సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖా మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు
పాస్టర్ల గౌరవ వేతనం చెల్లింపుపై కృతజ్ఞతలు తెలిపిన క్రైస్తవులు
అమరావతి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖా మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. క్రైస్తవ మైనార్టీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలను అమలు చేస్తోందని బుధవారం పేర్కొన్నారు. పాస్టర్ల గౌరవ వేతనం రూ.30 కోట్లు ఒకేసారి విడుదల చేసి చెల్లించడం పట్ల ఆలిండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్(ఐక్య) ప్రతినిధులు జి.రాజ సుందర బాబు, కె.హనోక్ బెంజిమెన్, రవికాంత్ తదితరులు మంత్రి ఫరూక్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో క్రైస్తవులు, చర్చిలు, పాస్టర్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం రూపొందించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులపై జరిగిన దాడులను మంత్రికి వివరించారు. శ్మశానాలకు స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఒకే సమాధిలో మూడు, నాలుగు మృతదేహాలను పూడ్చే పరిస్థితి నెలకొందని తెలిపారు. బీసీ-సీలు, పాస్టర్లు, సువార్తీకుల పిల్లలకు గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, ఆర్‌ఆర్‌బీ తదితర పరీక్షలకు ఏడాదికి కనీసం 200 మందికి సదుపాయాలతో ఉచిత శిక్షణ ఇవ్వాలని కోరారు.
Updated Date - Jun 26 , 2025 | 06:42 AM