యోగాంధ్రాకు 175 దేశాల ప్రతినిధులు
ABN, Publish Date - Jun 19 , 2025 | 06:40 AM
విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో పాటు ..
విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా
విశాఖపట్నం, అమరావతి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో పాటు 175 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. విశాఖ నుంచి భీమిలి వరకూ 29.8 కి.మీ. పొడవున కార్యక్రమం నిర్వహిస్తామని, ఒక్క బీచ్ రోడ్డులోనే 3.26 లక్షల మంది పాల్గొంటారని చెప్పారు. ఇంకా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పాల్గొనే వారితో కలిపితే మొత్తం ఐదు లక్షల మంది అవుతారన్నారు.
మరో నలుగురు ఐఏఎ్‌సలకు బాధ్యతలు
‘యోగాంధ్ర’ కార్యక్రమానికి మరో నలుగురు ఐఏఎ్‌సలను నియమిస్తూ సీఎస్ విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. యోగాంధ్రకు ప్రజలను సమీకరించేందుకు ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారి డా. మల్లికార్జునను ప్రభుత్వం నియమించింది. ఆయనకు మద్దతుగా ఐఏఎ్‌సలు ఎస్.రామసుందర్ రెడ్డి, రోణంకి కూర్మనాథ్, ఆర్.గోవిందరావు, ప్రకాశం జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణను నియమించింది.
Updated Date - Jun 19 , 2025 | 06:40 AM