ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Temple Land Row: మాజీమంత్రి పెద్దిరెడ్డికి నోటీసులు

ABN, Publish Date - May 07 , 2025 | 04:17 AM

తిరుపతి బుగ్గమఠం భూముల ఆక్రమణ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి దేవదాయశాఖ తుది నోటీసులు జారీ చేసింది. 14.49 ఎకరాల భూములపై ఆధారాలు సమర్పించకపోతే, చట్టప్రకారం ఆక్రమణల తొలగింపు చర్యలు ప్రారంభించనున్నారు

  • ఎల్లుండి దేవదాయ శాఖ అధికారి ఎదుట హాజరవండి

  • బుగ్గమఠం భూముల వ్యవహారంలో మరో నలుగురికీ...

  • హాజరుకాకుంటే ఆక్రమణల తొలగింపునకు ఉత్తర్వులు

తిరుపతి, మే 6(ఆంధ్రజ్యోతి): తిరుపతి బుగ్గమఠం భూముల వ్యవహారంలో ఈ నెల 9 న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఐదుగురికి దేవదాయ శాఖ తుది నోటీసులు జారీ చేసింది. ఒకవేళ హాజరు కాకపోతే బుగ్గమఠం భూముల్లో ఆక్రమణల తొలగింపునకు చట్టప్రకారం నోటీసులు జారీ చేయనుంది. బుగ్గమఠం అధికారులు, దేవదాయ శాఖ, రెవెన్యూ అధికారులు ఈ నెల 3న సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో భాగంగా మొత్తం 7 చోట్ల 14.49 ఎకరా ల మఠం భూములు ఆక్రమణకు గురైనట్టు గుర్తించారు. భూములు ఆక్రమించినవారిలో పెద్దిరెడ్డితో పాటు మఠం భూముల పాత కౌలుదారుల వారసులు మరో నలుగురు ఉన్నట్టు తేల్చారు. భూములు ఖాళీ చేయాలని ఈ ఐదుగురికీ మఠం అధికారులు గత మార్చి 7నే నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను పెద్దిరెడ్డి, పాత కౌలుదారైన యశోదమ్మ వారసులు హైకోర్టులో సవాల్‌ చేశారు. మిగిలిన పాత కౌలుదారుల వారసులు తమకు భూముల లీజును పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేదంటే ప్రస్తుత మార్కెట్‌ ధర నిర్ణయిస్తే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. పెద్దిరెడ్డి దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు వ్యక్తిగతంగా హాజరై ఆధారాలు సమర్పించేందుకు అవకాశం కల్పిస్తూ ఆయనకు నోటీసులు జారీ చేయాలని దేవదాయ శాఖ అధికారులను ఆదేశించింది.


దీంతో పెద్దిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. దాని ప్రకారం గతనెల 17న ఆయన జిల్లా దేవదాయ శాఖ అధికారి ఎదుట హాజరు కావాల్సి ఉండగా తాను ఎమ్మెల్యేగా పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్నందున ఆ తేదీన రాలేనని జవాబిచ్చారు. దీంతో 9న వ్యక్తిగతంగా హాజరై ఆధారాలు సమర్పించాలని పెద్దిరెడ్డితో పాటు మిగిలిన ఆక్రమణదారులకు రెండో, తుది నోటీసులు జారీచేశారు. అయితే బుగ్గమఠంలో అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం 14.49 ఎకరాల భూములను మఠం ఎవరికీ విక్రయించలేదు. వాటిపై పూర్తి అధికారాలు మఠానివే. విచారణకు హాజరైనవారు అందజేసే రికార్డులు చెల్లుబాటు కాకపోయినా, లేదా వారు హాజరు కాకపోయినా దేవదాయశాఖ అధికారులు మఠం భూముల్లో ఆక్రమణలు తొలగించాలంటూ పై ఐదుగురికీ ఎవిక్షన్‌ నోటీసులు జారీ చేయనున్నారు.

Updated Date - May 07 , 2025 | 04:17 AM