Pawan Kalyan Approves Promotions: ఉపాధి సిబ్బంది పదోన్నతులకు లైన్ క్లియర్
ABN, Publish Date - Apr 16 , 2025 | 07:04 AM
గ్రామీణాభివృద్ధిశాఖలో పనిచేస్తున్న ఉపాధి సిబ్బందికి పదోన్నతుల కోసం చర్యలు ప్రారంభించారు. సీనియారిటీ జాబితా రూపొందించి పదోన్నతులు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు
గ్రామీణాభివృద్ధిశాఖలో పనిచేసే ఉపాధి సిబ్బంది సమస్యల పరిష్కారానికి గ్రామీణాభివృద్ధిశాఖ చర్యలు ప్రారంభించింది. ఉపాధి సిబ్బందికి పదోన్నతులకు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. వారి డిమాండ్లలో ప్రధానమైన బదిలీలు ఇప్పటికే పూర్తి చేశారు. ఇప్పుడు వారి అర్హత, అనుభవాన్ని బట్టి పదోన్నతులు కల్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు కమిషనర్ కృష్ణతేజ మంగళవారం అధికారుల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. పదోన్నతులకు సీనియారిటీ జాబితా రూపొందించి కసరత్తు ప్రారంభించాలని ఎస్‌ఆర్‌డీఎస్ మెంబర్ సెక్రటరీ మద్దిలేటికి సూచనలిచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి సిబ్బంది హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Apr 16 , 2025 | 07:05 AM