ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Deputy CM Pawan: ఏనుగుల గుర్తింపునకు టాస్క్‌ఫోర్స్‌

ABN, Publish Date - Apr 29 , 2025 | 03:04 AM

ఏనుగుల ముప్పును నియంత్రించేందుకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో చిత్తూరులో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశారు. ప్రజలకు, ఏనుగులకు హాని జరగకుండా అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో చర్యలు తీసుకోనున్నారు

  • డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో ఏర్పాటు

అమరావతి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపుల వల్ల పంటల ధ్వంసం, రైతులు దుర్మరణం చెందుతున్న ఘటనల నేపథ్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆదేశించారు. వరుస ఘటనలపై సోమవారం అటవీ అధికారులతో డిప్యూటీ సీఎం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు. ఇలాంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు చెప్పారు. ఏనుగుల వల్ల ప్రజలకు, ప్రజల వల్ల ఏనుగులకు హాని జరక్కుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏనుగుల రాకపోకలను ట్రాక్‌ చేయడానికి అధునాత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. పవన్‌ ఆదేశాలతో తిరుపతి డీఎఫ్‌వో వివేక్‌ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశారు. చిత్తూరు డీఎ్‌ఫవో భరణితోపాటు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు చెందిన పీలేరు, తిరుపతి డీఎఫ్‌వోలు, బాకరాపేట, పనపక్కం, చిత్తూరు ఈస్ట్‌, వెస్ట్‌ పరిధిలోని ఆర్‌ఎ్‌ఫవోల టీమ్‌లు, పది మంది ఎలిఫెంట్‌ ట్రాకర్స్‌ను టాస్ట్‌ఫోర్స్‌లో నియమించారు.

Updated Date - Apr 29 , 2025 | 03:04 AM