AP Deputy CM Pawan: బంగాళాఖాతంలో ఘర్షణలు
ABN, Publish Date - May 06 , 2025 | 06:09 AM
తమిళ జాలర్లు బంగాళాఖాతంలో జరిగిన ఐదు ఘర్షణల్లో గాయపడ్డారని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత-శ్రీలంక సంబంధాల నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరారు.
తమిళ జాలర్లకు గాయాలపై పవన్ ఆందోళన
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): ఇటీవల బంగాళాఖాతంలో జరిగిన ఐదు వేర్వేరు ఘర్షణల్లో తమిళనాడుకు చెందిన 24 మంది భారత జాలర్లు భాగస్వామ్యం కావడం ఆందోళన కలిగిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సంఘటనలపై సోమవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. తమిళనాడులోని నాగపట్నం జిల్లాకు చెందిన జాలర్లు సముద్రంలో జరిగిన ఘర్షణల కారణంగా గాయపడ్డారని తెలిసిందన్నారు. ఇది వారి జీవనోపాధిపై కూడా ప్రభావితం చూపిస్తుందన్నారు. భారత్, శ్రీలంక మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాల దృష్ట్యా ఇలాంటి సంఘనటలు పునరావృతం కాకుండా చూడాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను పవన్ కోరారు. ఇరుదేశాలకు చెందిన జాలర్ల భద్రత దృష్ట్యా.. భారత్, శ్రీలంక ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ఈ సమస్యలను పరిష్కరించాలన్నారు.
Updated Date - May 06 , 2025 | 06:10 AM