Perni Nani Hate Speech: వైసీపీ నేత పేర్ని నానికి దక్కని ఊరట
ABN, Publish Date - Jul 18 , 2025 | 04:30 AM
వైసీపీ కార్యకర్తల సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత పేర్ని నానికి హైకోర్టులో ..
అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరణ
అమరావతి, జూలై 17(ఆంధ్రజ్యోతి): వైసీపీ కార్యకర్తల సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించలేదు. పామర్రు ఠాణాలో నమోదైన కేసులో అరె్‌స్టతో పాటు ఎలాంటి తొందరపాటు చర్యలూ తీసుకోకుండా పోలీసులను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న నాని తరఫు సీనియర్ న్యాయవాది అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. కేసుకి సంబంధించి పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. విచారణను జూలై 22కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు సింగిల్ జడ్జి గురువారం ఉత్తర్వులిచ్చారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, పేర్ని నాని తరఫు సీనియర్ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్
Updated Date - Jul 18 , 2025 | 04:30 AM