Lokesh VR High School Speech: వీఆర్ స్కూల్ అద్భుతం.. ఆ ఇద్దరి కృషి చాలా గొప్పది: మంత్రి లోకేష్
ABN, Publish Date - Jul 07 , 2025 | 11:42 AM
Lokesh VR High School Speech: సౌత్ ఇండియాలో ఇన్ని వసతులు ఉన్న స్కూల్ మరొకటి ఉండదేమో అని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. మంత్రి నారాయణ, ఆయన కుమార్తె శరణి చేసిన కృషి చాలా గొప్పదని మంత్రి కొనియాడారు.
నెల్లూరు, జులై 7: భూమి కంటే ఎక్కువుగా మన భారం మోసేది అమ్మ అని.. అందుకే తల్లికి వందనం పేరుతో తల్లిని గౌరవిస్తూ ముందుకు వెళుతున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్నారు. జిల్లాలోని వీఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవం అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను చూస్తే దేవుళ్లు గుర్తొస్తారని తెలిపారు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న వీఆర్ పాఠశాల ఆరు నెలలు కిందట ఘోరమైన పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యపడ్డానని... ఇప్పుడు చూసి అసూయపడుతున్నట్లు చమత్కరించారు. చాలా చక్కగా మంత్రి నారాయణ (Minister Narayana) వీఆర్ హైస్కూల్‌ను తీర్చిదిద్దారని అభినందించారు. నెల్లూరులోనే ఇలాంటి అత్యాధునిక స్కూల్ ఎక్కడా లేదని... అందుకే ఇక్కడ చేరామని పిల్లలు చెబుతున్నారన్నారు.
సౌత్ ఇండియాలో ఇన్ని వసతులు ఉన్న స్కూల్ మరొకటి ఉండదేమో అని చెప్పుకొచ్చారు. మంత్రి నారాయణ, ఆయన కుమార్తె శరణి చేసిన కృషి చాలా గొప్పదని మంత్రి కొనియాడారు. రాష్ట్రంలో పేద కుటుంబమే ఉండకూడదని... ప్రతీ ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని సీఎం చంద్రబాబు P4 తీసుకొచ్చారని తెలిపారు. మంగళగిరిలో ఓడిపోయినప్పుడు బాధపడ్డానని.. కానీ గెలవాలనే లక్ష్యంతో కష్టపడి, అత్యధిక మెజార్టీతో గెలుపొందానని వెల్లడించారు. అందరూ వద్దన్నా కూడా కష్టమైన విద్యాశాఖ తీసుకున్నానని తెలిపారు.
ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు సూచనతో మధ్యహ్న భోజనంలో సన్నబియ్యం అన్నం తెచ్చామన్నారు. తొమ్మిది వేల స్కూళ్లలో ఒన్ క్లాస్, ఒన్ టీచర్ ఉన్నారని అన్నారు. మెగా డీఎస్సీ నిర్వహించామని.. ఖాళీలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. పవనన్న చెట్లు నాటాలని పిలుపునిచ్చారని... పిల్లలకు గ్రీన్ కార్డులు ఇవ్వబోతున్నామని తెలిపారు. మొక్కనాటి మూడేళ్లు కాపాడే బాధ్యత వారిపై ఉంచుతామని అన్నారు. యావత్ దేశంలో ప్రభుత్వ విద్యలో ఏపీని ఉన్నత స్థాయిలో ఉంచుతామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
మామిడి కొనుగోలుపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
సిగాచి పరిశ్రమలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Read latest AP News And Telugu News
Updated Date - Jul 07 , 2025 | 12:05 PM