Kakani Court Case: కాకాణి కస్టడీపై వాదనలు పూర్తి.. తీర్పు ఏంటంటే
ABN, Publish Date - Jun 03 , 2025 | 04:39 PM
Kakani Court Case: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
నెల్లూరు, జూన్ 3: క్వార్జ్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Former Minister Kakani Goverdhan Reddy) పోలీస్ కస్టడీ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. కస్టడీ పిటిషన్, అలాగే బెయిల్ పిటిషన్‌పై ఈనెల 5న (గురువారం) న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. కాకాణిని కస్టడీలోకి తీసుకుంటే కేసులో పూర్తి వివరాలు తెలుస్తాయని డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ తెలిపారు. కేసులో ముద్దాయిలు ఇచ్చిన సమాచారం మేరకు కాకాణిని కస్టడీకి తీసుకుంటే లోతైన సమాచారం సేకరించవచ్చన్నారు. కోర్టులో ఇరుపక్షాల వాదనలు న్యాయమూర్తి విన్నారని... పోలీస్ కస్టడీకి ఇస్తారన్న నమ్మకం ఉందని డీఎస్పీ శ్రీనివాస్ చెప్పారు.
క్వార్ట్జ్ స్కాంలో 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో కాకాణి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ కావాలంటూ ఈరోజు ఐదో అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ కేసును న్యాయస్థానం ఈనెల 5కు వాయిదా వేసింది. అలాగే కాకాణిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి అవసరం ఉందని, ఈ కేసులో ఇప్పటికే చాలా మంది నిందితులు, సాక్షుల వద్ద నుంచి సమాచారాన్ని సేకరించామని, వీటిన్నింటిపై కాకాణిని విచారించాల్సి ఉందంటూ కస్టడీ కోరారు పోలీసులు. ఆ కస్టడీ పిటిషన్‌పై దాదాపు మూడు గంటల పాటు ప్రభుత్వ న్యాయవాదులు, కాకాణి తరఫు న్యాయవాదుల మధ్య వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈనెల 5కు వాయిదా వేసింది. కచ్చితంగా కాకాణిని కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందని పోలీసుశాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాకాణికి కస్టడీకి తీసుకుంటేనే ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారణ చేయగలిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
కాగా.. క్వార్జ్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం కేసులో మాజీ మంత్రి కాకాణిని గత నెలలో బెంగళూరు సమీపంలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కాకాణి ఏ4గా ఉన్నాయి. ఈ కేసు విచారణకు రావాలంటూ కాకాణికి పలుమార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదు. కేసు నమోదైన తర్వాత తాను ఎక్కడికి పోనని.. నెల్లూరులోనే ఉంటానని, విచారణకు సహకరిస్తానని చెప్పిన ఆయన.. ఆ తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అంతేకాకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీం కోర్టులో పిటిషన్లు వేసినప్పటికీ అక్కడ కూడా కాకాణికి ఎదురుదెబ్బే తగిలిలింది. దాదాపు 55 రోజులుగా పరారీలో ఉన్న కాకాణి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
ఇవి కూడా చదవండి
జగన్ ఖబడ్దార్.. మంత్రుల హెచ్చరిక
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 03 , 2025 | 04:56 PM