Navy Officers: నేవీ విశ్రాంత అధికారుల సముద్ర యాత్ర
ABN, Publish Date - May 18 , 2025 | 05:01 AM
విజయనగరం కోరకుండ సైనిక్ స్కూల్ మాజీ విద్యార్థులు, నేవీ విశ్రాంత అధికారులైన శ్రీనివాస్ కల్నల్, సీడీఎన్‌వీ ప్రసాద్ సముద్ర యాత్ర ప్రారంభించారు. వారు న్యూజిలాండ్ నుంచి అండమాన్ దీవుల వరకు 34 అడుగుల బోటులో ప్రయాణిస్తున్నారు.
న్యూజిల్యాండ్‌లోని ఓపూవా బే నుంచి
అండమాన్‌లోని శ్రీవిజయపురం వరకు...
విశాఖపట్నం, మే 17(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఇద్దరు ఆరు పదుల వయస్సు దాటిన తరువాత సముద్ర యాత్ర చేపట్టారు. వీరు నేవీలో పనిచేసి పదవీ విరమణ చేశారు. కె.శ్రీనివాస్ కల్నల్ హోదాలో, సీడీఎన్‌వీ ప్రసాద్ కెప్టెన్ హోదాలో రిటైర్ అయ్యారు. వీరిద్దరు ఈ నెల 14న న్యూజిలాండ్‌లోని ఓపూవా బే నుంచి 34 అడుగుల పొడవైన ‘టిస్టి’ అనే బోటులో యాత్ర ప్రారంభించారు. పోర్టు ఫిజీలోని సవుసావుకు ఈనెల 27న చేరుకుంటారు. ఇండోనేసియా, మలేసియా, థాయ్‌ల్యాండ్ మీదుగా అండమాన్, నికోబార్ దీవుల్లోని శ్రీవిజయపురం వరకు యాత్ర సాగుతుందని నేవీ వర్గాలు తెలిపాయి.
Updated Date - May 18 , 2025 | 05:02 AM