ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MLC Nagababu: ప్రమాదాల్లో కార్యకర్తల్ని కోల్పోవడం బాధాకరం

ABN, Publish Date - Jun 03 , 2025 | 03:36 AM

జనసేన కార్యకర్తలు అనుకోని ప్రమాదాల్లో మృతి చెందడాన్ని ఎమ్మెల్సీ నాగబాబు బాధాకరంగా పేర్కొన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులు పంపిణీ చేయడం తృప్తినిచ్చిందన్నారు.

  • బీమాతో ఆర్థిక భరోసాను అందించడం తృప్తినిస్తోంది: ఎమ్మెల్సీ నాగబాబు

అమరావతి, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): ‘సామాజిక కార్యక్రమాల్లో, పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా పని చేసే కార్యకర్తలు ఊహించని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధను కలిగిస్తుంది. ప్రాణా లు తీసుకురాలేం. కానీ మరణించిన వారి కుటుంబాలకు ప్రమా ద బీమా ద్వారా ఆర్థిక భరోసా అందించడం కాసింత తృప్తిగా అనిపిస్తుంది’ అని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు అన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు సోమవారం మంగళగిరిలో ఆయన బీమా చెక్కులను అందించారు. ‘అధినేత పవన్‌ కల్యాణ్‌ కార్యకర్తల బాగు కోసమే ప్రథమంగా ఆలోచిస్తారు. ప్రమాద బీమా కొరకు రూ.కోట్లు తన వ్యక్తిగత సంపాదన వెచ్చిస్తున్నారు. ఈ రోజు దాదాపు 101 మంది కార్యకర్తలకు రూ.5.05 కోట్ల ప్రమాద బీమా చెక్కులను అందించాం’ అని నాగబాబు తెలిపారు. ఇప్పటి వరకూ రూ.30 కోట్ల ప్రమాద బీమాను అందించామని ఎమ్మెల్సీ హరిప్రసాద్‌ తెలిపారు. ఈ నెల 4న పార్టీ రూపొందించిన ‘పీడ విరగడై ఏడాది - సుపరిపాలన మొదలై ఏడాది’ కార్యక్రమాన్ని జనసేన శ్రేణులంతా ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీఎంఎ్‌సఐడీసీ చైర్మన్‌ చిల్లపల్లి శ్రీనివాసరావు, షేక్‌ రియాజ్‌ ఇతర నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2025 | 03:38 AM