ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

SIT Reveals: రింగ్‌ మాస్టర్‌ మిథున్‌రెడ్డే

ABN, Publish Date - Jul 21 , 2025 | 03:45 AM

వైసీపీ హయాంలో జరిగిన మద్యం ముడుపుల దందాలో రాజంపేట ఎంపీ, వైసీపీ నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డే రింగ్‌మాస్టర్‌. మద్యం సిండికేట్‌కు ప్రాణంపోసింది మొదలు రూ.3,200 కోట్ల మేర సొమ్మును దోచుకునేందుకు...

  • లిక్కర్‌ సిండికేట్‌ను నడిపింది ఆయనే దందాలో కర్త, కర్మ, క్రియ ఎంపీనే

  • విచారణకు ఏ మాత్రం సహకరించలేదు

  • పైగా.. తప్పుదారి పట్టించే యత్నం చేశారు

  • ఎంపీ కనుసన్నల్లోనే షెల్‌ కంపెనీల ఏర్పాటు

  • నగదు మళ్లింపూ ఆయన ఆధ్వర్యంలోనే

  • సిండికేట్‌ నుంచి పీఎల్‌ఆర్‌ ప్రాజెక్టుకు సొమ్ము

  • నాటి సీఎంకు చేరిన నిధులు.. లెక్క తేల్చాల్సిందే

  • రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు.. కస్టడీకి వినతి

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘‘వైసీపీ హయాంలో జరిగిన మద్యం ముడుపుల దందాలో రాజంపేట ఎంపీ, వైసీపీ నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డే రింగ్‌మాస్టర్‌. మద్యం సిండికేట్‌కు ప్రాణంపోసింది మొదలు రూ.3,200 కోట్ల మేర సొమ్మును దోచుకునేందుకు జరిగిన వ్యూహాత్మక నేరపూరిత కుట్ర రూపకల్పన, దాని అమలకు ఆయనే కర్త, కర్మ, క్రియ.’’ అని ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) కుండబద్దలు కొట్టింది. మద్యం ముడుపుల కుంభకోణం ఆలోచన ఇచ్చి, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి, వేలకోట్ల సొమ్మును కొల్లకొట్టడంలో ఆది నుంచి అంతం వరకు, నాటి ముఖ్యమంత్రికి అవినీతి సొమ్ము చేరే దాకా ఈ ఎంపీనే ప్రధాన పాత్రధారి అని వెల్లడించింది. శనివారం రాత్రి ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్‌ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 409, 420, 384, 201, 120(బీ), రెడ్‌విత్‌ సెక్షన్‌ 34, 37లతోపాటు, అవినీతి నిరోధక చట్టం(పీసీఏ) 1988లోని సెక్షన్‌7, 7ఏ, 8, 12, 12(1)(బీ), 13(2)ల కింద కేసులు నమోదు చేసింది. ఈ సందర్భంగా సిట్‌ సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది. నాటి ముఖ్యమంత్రి జగన్‌కు అవినీతి సొమ్ము చేరిందన్న అంశాన్ని ప్రస్తావిస్తూనే, మద్యం ముడుపుల దందాలో మిథున్‌రెడ్డి పాత్ర ఎలా మొదలైంది? ఆయన ఏం చేశారో సవివరంగా పేర్కొంది.

అలా మొదలైంది..

2014-19 మధ్య లిక్కర్‌ పాలసీ ఆటోమెటిక్‌ పంపిణీ విధానంలో కొనసాగింది. 2019లో జగన్‌ ప్రభుత్వం వచ్చాక మద్యం వ్యాపారం నుంచి నెలవారీగా ముడుపులు రాబట్టుకోవాలని మిథున్‌రెడ్డి ప్రణాళిక చేశారు. అయితే, ముడుపులకు ప్లాన్‌ చేయమని ఆయనకు ఎవరు చెప్పారు? ఆ తెరవెనక ఉన్న శక్తి ఎవరు? తేలాల్సి ఉందని సిట్‌ పేర్కొంది. విచారణ సందర్భంగా ఎంపీ తమకు సహకరించలేదని, కీలకమైన అంశాల్లో దాటవేత ధోరణిని కనబర్చారని రిపోర్టులో తెలిపింది. ఈ దందాలో ప్రమేయం ఉన్నవారిని కాపాడేందుకు, కొత్తగా మరెవరి పాత్ర వెలుగులోకి రాకుండా ఉండేందుకు మొత్తం అంశాన్ని తప్పుదోవపట్టించేలా మిథున్‌ వ్యవహరించారని సిట్‌ పేర్కొంది.

కుట్రకు రూపశిల్పి

2019లో జగన్‌ ప్రభుత్వం వచ్చాక మద్యం నుంచి రూ.వేల కోట్లను ముడుపుల రూపంలో పిండుకోవాలని ప్లాన్‌ వేశారు. ఈ ముడుపుల దందా ఎలా ఉండాలి? ఎలా అమలు చేయాలి? ఎవరెవరు భాగస్వాములవ్వాలి? డిస్టిలరీస్‌ ఏం చేయాలి? ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను ఎలా వాడుకోవాలి? అక్కడి అధికారులను గుప్పిట్లో పెట్టుకొని తమ పన్నాగాలను ఎలా అమలు చేయాలన్న అంశాలన్నీ మిథున్‌రెడ్డి ఆలోచన నుంచి వచ్చినవే. నిర్మాణాత్మక నేరపూరిత నిధుల దోపిడీ కుట్రకు మిఽథున్‌రెడ్డి తిరుపతిలోని తన ఇంటి నుంచే శ్రీకారం చుట్టారు. బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఉన్న సత్యప్రసాద్‌ను ఈ కుట్రకు పావుగా వాడుకోవాలనుకున్నారు. ముడుపుల దందాపై చర్చించేందుకు తిరుపతిలోని తన నివాసానికి 2019, అక్టోబరు 10న సత్యప్రసాద్‌ను పిలిపించుకుని, మద్యం సిండికేట్‌ కోసం పనిచేయాలని ఆదేశించారు. ప్రతిఫలంగా ఆయనకు 2023 కోటాలో ఐఏఎస్‌ పదోన్నతి కల్పిస్తామని ఆశచూపారు. దీంతో సత్యప్రసాద్‌ లొంగిపోయారు. 3 రోజుల తర్వాత(13-10-2019) రెండో మీటింగ్‌ హైదరాబాద్‌లో అప్పటి ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో జరిగింది.ఈ సమావేశంలోనే మద్యం సిండికేట్‌ పనితీరు, డిస్టిలరీస్‌ నుంచి ముడుపులు ఎలా వసూలు చేయాలి? ఏయే బ్రాండ్లను ప్రోత్సహించాలి? డిస్టిలరీ్‌సతోపాటు, మద్యం కంపెనీల నుంచి నెలవారీ ముడుపులు ఎలా వసూలు చేయాలి? అన్న అంశాలపై కీలక చర్చ జరిగింది. నెలకు రూ.50-60 కోట్ల మేరకు మద్యం ముడుపులు రాబట్టాలనిప్లాన్‌ చేశారు. మద్యం అమ్మకాల బేస్‌ ధరపై కనీసం 12 శాతం కమీషన్‌ వసూలు చేయాలని ఎంపీ మిథున్‌రెడ్డి ప్రతిపాదించారు. తన ప్లాన్‌ పక్కాగా అమలు చేసేందుకు సత్యప్రసాద్‌, వాసుదేవరెడ్డిలకు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. మద్యం అమ్మకాలకు సంబంధించి 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఆటోమేటిక్‌ విధానం తీసేయాలని, ఆ స్థానంలో మాన్యువల్‌ పంపిణీ విధానం తీసుకురావాలని సూచించారు.

ముడుపుల సొమ్ముతో..

డిస్టిలరీల నుంచి వసూలు చేసిన సొమ్ముతో బంగారం కొనుగోలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెట్టించారు. ఆఫ్రికా, దక్షణాసియా, అమెరికాల్లో అక్రమ పెట్టుబడులు పెట్టించారు. ఇవే కాకుండా ఎస్‌పీవై ఆగ్రోస్‌, శాన్‌లాబ్‌, డీ-కార్ట్‌ లాజిస్టిక్స్‌ మధ్య రూ.కోట్ల లావాదేవీలు నడిపించారు. పేమెంట్స్‌ డిస్కౌంట్స్‌లో మానిప్యులేషన్‌ చేయడం ద్వారా బేవరేజెస్‌ కార్పొరేషన్‌కి రూ.200 కోట్ల నష్టం కలిగించడంలో ఎంపీ కీలక పాత్రధారుగా ఉన్నారు. కీలక నిందితులతో ఎంపీ మిథున్‌రెడ్డి వాట్సాప్‌ చాటింగ్‌ చేశారు. 2023, మే నుంచి 2024, మే వరకు ఏడాది కాలంలో కృష్ణమోహన్‌రెడ్డి(55 సార్లు), చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి(23 సార్లు), మోహిత్‌రెడ్డి(4 సార్లు), వాసుదేవరెడ్డి, ధనుంజయ్‌రెడ్డిలతో అనేక సార్లు ఫోన్‌లో మాట్లాడారు. రజత్‌భార్గవ, ఈ కేసులో సాక్షిగా ఉన్న బీవీఎస్‌ డిస్టిలరీస్‌ ఎండీ వెంకటసుబ్బారావుతో కూడా మిథున్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడినట్లు సిట్‌ పలు ఆధారాలను సమర్పించింది.

అడ్డంగా దొరికింది ఇక్కడే

మద్యం సిండికేట్‌లో కీలంగా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డి.. ఎస్‌పీవై ఆగ్రోస్‌, శాన్‌హాక్‌ లాబ్‌, డీ-కార్ట్‌ లాజిస్టిక్స్‌ మధ్య రూ.కోట్ల లావాదేవీలు నడిపించారు. చివరకు డీ-కార్ట్‌ లాజిస్టిక్స్‌ ఖాతా నుంచి పీఎల్‌ఆర్‌ ప్రాజెక్టుకు రూ.5 కోట్ల నిధులు వెళ్లాయి. ఈ విషయంలోనే ఎంపీ అడ్డంగా దొరికిపోయారు. పీఎల్‌ఆర్‌ ప్రాజెక్టు అనేది ఎంపీ మిథున్‌రెడ్డి కుటుంబ కంపెనీ. కాబట్టి, డీ-కార్ట్‌ లాజిస్టిక్స్‌ నుంచి పీఎల్‌ఆర్‌ ప్రాజెక్టు కంపెనీకి నిధులు రావడం అనేది లిక్కర్‌ కుంభకోణంలో ఆయన పాత్రను స్పష్టం చేస్తోంది. అంతేకాదు, సిండికేట్‌లోని కంపెనీల నుంచి ఎంపీ కుటుంబ వ్యాపారాలకు రూ.కోట్ల నిధులు వెళ్లడం కూడా యాదృచ్ఛికంకాదు. ఎంపీ నేతృత్వంలోనే మనీలాండరింగ్‌ జరిగింది. ఆయా విషయాలపై పక్కా ఆధారాలను ఎంపీ ముందు ఉంచి ప్రశ్నిస్తే.. దాటవేసే ప్రయత్నం చేశారు. ఈ దందాలో ఇతరులను కాపాడేలా వ్యవహరించారు. విచారణకు సహకరించలేదు. ఈ కేసులో అన్ని అంశాలను వెల్లడించాల్సింది ఎంపీనే. ఎంపీ కుటుంబానికి పీఎల్‌ఆర్‌తోపాటు ‘శివశక్తి డైరీ’ కూడా ఉంది. ఇంకా అనేక లెక్కలు తేలాల్సి ఉంది. కాబట్టి ఆయన్ను కస్టడీకి ఇవ్వాలి.

ఇదీ లెక్క!

డిస్టిలరీలు, కంపెనీలతో ముడుపుల వ్యవహారాన్ని చర్చించేందుకు ఎంపీ మిథున్‌రెడ్డి ప్రత్యేకంగా మనుషులను నియమించారు. 2018-19లో 30 లక్షల కేసుల ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌, 10 లక్షల కేసుల బీరు అమ్ముడుపోయా యి. కాబట్టి, ఒక్కో కేసుపై రూ.150-600 మేరకు మద్యం ముడుపులు వసూలు చేయాలని ఎంపీ సూచించారు. ముడుపులు చెల్లించేందుకు అంగీకరించిన డిస్టిలరీల నుంచే సరుకు తీసుకుని, వాటినే ప్రభుత్వ రిటైల్‌ దుకాణాల్లో విక్రయించాలని ఎంపీ ఆదేశించారు. ఈ మేరకు డిస్టిలరీల నుంచి తీసుకునే ముడుపులను(బేస్‌ ధరపై) 12 నుంచి 20 శాతానికి పెంచారు. ఇలా వచ్చిన సొమ్ము రాజ్‌ కసిరెడ్డి, మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి తదితరుల ద్వారా నాటి సీఎం జగన్‌కు చేరింది. డిస్టిలరీల నుంచి డబ్బు వసూలు బాధ్యతను రాజ్‌ కసిరెడ్డి చూడగా, ఆ సొమ్మును నాటి సీఎంకి చేర్చడంలో మిథున్‌రెడ్డి పాత్ర ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి..

రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు

ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 03:52 AM