Heavy Rains: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
ABN , Publish Date - Jul 20 , 2025 | 03:09 PM
హైదరాబాద్ మహానగరాన్ని వర్షాలు వీడడం లేదు. పలు ప్రాంతాాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగి పోతున్నాయి. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
హైదరాబాద్, జులై 20: తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో వరుసగా నాలుగో రోజు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంబర్పేట్, తార్నాక, ఉప్పల్, హబ్సిగూడ, మలక్ పేట, చాదర్‌ఘాట్, సైదాబాద్, సంతోష్ నగర్, హిమాయత్ నగర్, నల్లకుంటతోపాటు బషీర్‌బాగ్‌లో భారీ వర్షం కురుస్తుంది.
బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి అవరించి ఉంది. దీంతో జులై 24వ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ క్రమంలో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ వెల్లడించింది. అలాగే తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురవనుందని సూచించింది.
అందులోభాగంగా హైదరాబాద్ సహా 10 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మరోవైపు శనివారం భాగ్యనగరంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసింది. మరోవైపు హైదరాబాద్‌లో భారీ వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో చర్చిస్తూ.. కీలక సూచనలు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు రావాలని ప్రజలకు ఆయన సూచించారు.
ఇంకోవైపు జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్, హైడ్రా కమిషనర్, పోలీస్ కమిషనర్, వాటర్వర్క్స్తోపాటు ఇతర అధికారులను అప్రమత్తం చేశామని చెప్పారు. భారీ వర్షాలపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు సీఎం సూచించారు. నగరంలో వర్షపు నీరు నిల్వకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు
బ్రెయిన్ స్ట్రోక్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా..
For More Telangana News And Telugu News