Mother Appeals to Pawan Kalyan: నా బిడ్డలను విడిపించండి
ABN, Publish Date - Jul 11 , 2025 | 03:34 AM
ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఏజెంట్ చేతిలో మోసోయి విదేశాల్లో మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో మగ్గుతున్న తమ కుమారులను రక్షించాలంటూ..
మానవ అక్రమ రవాణా ముఠా చేతిలో మగ్గుతున్నారు
డిప్యూటీ సీఎంకు విజయనగరం మహిళ విన్నపం
వెంటనే విదేశాంగ మంత్రితో మాట్లాడిన పవన్
అమరావతి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఏజెంట్ చేతిలో మోసోయి విదేశాల్లో మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో మగ్గుతున్న తమ కుమారులను రక్షించాలంటూ విజయనగరానికి చెందిన గండబోయిన సూర్యకుమారి అనే మహిళ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు వేడుకున్నారు. ఈమేరకు ఆమె గురువారం డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చి పవన్‌కు వినతిపత్రం అందించారు. మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా ఉన్న తమ వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, వారిని విడిపించేందుకు సాయం చేయాలని వేడుకున్నారు. తమ ఇద్దరు కుమారులతో పాటు ఎనిమిది మంది అక్రమ రవాణా చెరలో ఉన్నట్లు వివరించారు. ఆమె ఆవేదన చూసిన పవన్ కల్యాణ్ వెంటనే కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్త శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో చిక్కుకున్న వారిని రక్షించాలని ఆయన్ని కోరారు. ఈ వ్యవహారంపై విదేశీ వ్యవహారాల శాఖ సానుకూలంగా స్పందించింది. విదేశాల్లో మగ్గుతున్న వారిని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తామని ఆమెకు పవన్ హామీ ఇచ్చారు.
Updated Date - Jul 11 , 2025 | 03:34 AM