ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Orphaned Girl : అమ్మా.. నాన్నా లేక... అక్షరమే ఆలంబనగా...!

ABN, Publish Date - Mar 23 , 2025 | 04:26 AM

మండే ఎండలో.. చెట్టు నీడలో రిక్షాపై కూర్చుని ఒకవైపు చదువుకుంటూ... మరోవైపు పండ్లు అమ్ముతున్న ఈ బాలిక పేరు మోక్షిత.

ABN Andhra Jyothi: మండే ఎండలో.. చెట్టు నీడలో రిక్షాపై కూర్చుని ఒకవైపు చదువుకుంటూ... మరోవైపు పండ్లు అమ్ముతున్న ఈ బాలిక పేరు మోక్షిత. ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. మోక్షితకు ఆరు నెలల వయసున్నప్పుడే తల్లి అనారోగ్యంతో చనిపోయింది. తండ్రి వేరే పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. అప్పటి నుంచి వృద్ధులైన అమ్మమ్మ, తాతలే ఆ బాలికకు ఆదరవు అయ్యారు. చిత్తూరులోని జిల్లా పరిషత్‌ కార్యాలయం ఎదుట రోడ్డుపై ఇలా బుట్టల్లో పండ్లను పెట్టుకుని అమ్ముకుంటూ ఆ వృద్ధులు పొట్ట నింపుకొంటున్నారు. ఉదయం స్కూలుకు వెళ్తున్న మోక్షిత... మధ్యాహ్నం నుంచి అవ్వా తాతలకు సాయంచేస్తోంది. పాపను బాగా చదివించాలన్నదే తమ కోరికని అందుకే ఈ వయసులోనూ కష్టపడుతున్నామని మోక్షిత తాత సుబ్రమణ్యం చెప్పారు. అద్దె ఇంటిలో ఉంటున్న తమకు ప్రభుత్వం సొంత ఇల్లు సమకూర్చాలని వేడుకున్నారు.

Updated Date - Mar 23 , 2025 | 04:27 AM