Vangalapudi Anitha: మాల్స్‌ను తనిఖీ చేసి నివేదిక ఇవ్వండి
ABN, Publish Date - May 13 , 2025 | 05:09 AM
హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్రవ్యాప్తంగా మాల్స్‌పై అగ్నిమాపక శాఖ అధికారుల ద్వారా తనిఖీలు నిర్వహించి, 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాల్స్‌లో కనీస అగ్నిమాపక నిబంధనలు పాటించకపోవడంపై ఆమె గమనించి, సత్వర చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఫైర్ సేఫ్టీ’ నిబంధనలను పరిశీలించండి
అగ్నిమాపక అధికారులకు హోంమంత్రి ఆదేశం
విజయనగరం, మే 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాల్స్‌పై అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలు చేసి నెల రోజుల్లో నివేదికలు ఇవ్వాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. సోమవారం విజయనగరం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని చాలా మాల్స్‌కు అగ్నిమాపక శాఖ అనుమతులు లేవని, వైసీపీ ప్రభుత్వ హయాంలో సెల్ఫ్ డిక్లరేషన్‌తో ఎన్‌వోసీలు ఇచ్చేశారని అన్నారు. మాల్స్‌లో కనీస నిబంధనలు పాటించలేదని, తక్షణమే ఆయా అంశాలను అధికారులు పరిశీలించాలన్నారు. ఫైర్ సేఫ్టీ పాటిస్తున్నారా? లేదా? అనేది చూడాలని ఆదేశించారు.
రెచ్చకొట్టినట్లు వ్యవహరిస్తే కఠిన చర్యలు
మత సంబంధ వ్యవహారాలను ప్రస్తావిస్తూ ఎవరైనా రాజకీయ ముసుగులో రెచ్చకొట్టినట్లు మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హెచ్చరించారు. దేశం గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే విడిచిపెట్టేది లేదన్నారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలోని అమరువీరుల స్థూపం వద్ద పాకిస్థాన్ ముష్కరుల దాడిలో అమరులైన వీర జవాన్లకు నివాళులర్పించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. యుద్ధంలో అమరులైన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ జిల్లా పోలీసుశాఖ సోమవారం రాత్రి చేపట్టిన క్యాండిల్ ర్యాలీలో ఇద్దరు మంత్రులతో పాటు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ అంబేడ్కర్, ఎస్పీ వకుల్ జిందాల్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..
Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల
Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ
For AndhraPradesh News And Telugu News
Updated Date - May 13 , 2025 | 05:09 AM