Subhash Vasanthetti: మ్యాన్ పవర్ ఏజెన్సీల తీరు మారాలి
ABN, Publish Date - May 07 , 2025 | 07:23 AM
మ్యాన్‌పవర్ ఏజెన్సీల ద్వారా పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం, పీఎఫ్ చెల్లించడం వంటి అవకతవకలు జరుగుతున్నాయని మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. ఇక నుంచి ఈ దుష్ప్రవర్తనను ఉపేక్షించేది లేదని చెప్పారు
అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): మ్యాన్ పవర్ ఏజెన్సీల కింద పని చేస్తున్న సిబ్బందికి కనీస వేతనాలు కూడా చెల్లించకుండా ఇబ్బందుల పెడుతున్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు మ్యాన్ పవర్ కింద పని చేస్తున్న కార్మికులకు పీఎ్‌ఫలు కూడా కట్టడం లేదు. మ్యాన్ పవర్ ఏజెన్సీల అవకతవకలను ఇక ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు’ అని మంత్రి వాసంశెట్టి సుభాశ్ హెచ్చరించారు. మంగళవారం సచివాలయంలో కార్మిక, ఫ్యాక్టరీల శాఖల అధికారులతో సమావేశమైన మంత్రి మ్యాన్‌పవర్ ఏజెన్సీల తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా లేబర్ డిపార్టెమెంట్ వెబ్‌సైట్‌తో పాటు ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు.
Updated Date - May 07 , 2025 | 07:23 AM