Minister Savitha: డైట్ చార్జీల పెంపునకు కృషి
ABN, Publish Date - Jul 01 , 2025 | 06:37 AM
హాస్టల్ విద్యార్థులకు ఇచ్చే డైట్ చార్జీల పెంపునకు కృషి చేస్తానని మంత్రి సవిత తెలిపారు. మంత్రి పదవి చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెను రాష్ట్ర బీసీ వసతి గృహ సంక్షేమాధికారుల సంఘ ప్రతినిధులు క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.
గుంటూరు, జూన్ 30(ఆంధ్రజ్యోతి): హాస్టల్ విద్యార్థులకు ఇచ్చే డైట్ చార్జీల పెంపునకు కృషి చేస్తానని మంత్రి సవిత తెలిపారు. మంత్రి పదవి చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెను రాష్ట్ర బీసీ వసతి గృహ సంక్షేమాధికారుల సంఘ ప్రతినిధులు క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. మంత్రి సవిత మాట్లాడుతూ డైట్ చార్జీల పెంపు విషయమై ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల హాస్టళ్లకు సంబంధించి డైట్ చార్జీలపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీసీ వసతి గృహసంక్షేమాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మస్తాన్, గౌరవ అధ్యక్షుడు దయానంద్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 01 , 2025 | 07:29 AM