Nimmala Ramanaidu: నెలాఖరులోగా కాలువల మరమ్మతులు
ABN, Publish Date - May 13 , 2025 | 05:07 AM
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ నెలాఖరులోగా కాలువల పూడికతీత పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. విధానాలు సరిగ్గా అమలు చేయడాన్ని, నాణ్యతా ప్రమాణాలతో పనులు ముగించడాన్ని ఆయన ముఖ్యంగా పేర్కొన్నారు.
యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టాలి: మంత్రి నిమ్మల
అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): ఈ నెలాఖరులోగా కాలువల పూడికతీత వంటి మరమ్మతు పనులు పూర్తిచేయాలని జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. సోమవారం విజయవాడ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ చీఫ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అవసరమైన చోట్ల వారం రోజుల వ్యవధిలో స్వల్పకాలిక టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర పనులన్నింటినీ నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాలువల్లో పూడికతీత పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అదేశించారు. కాలువల్లో సముద్రపు డెక్క, తూటికాడ వంటి కలుపు మొక్కలను తొలగించాలన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభానికి ముందే కాలువలన్నింటినీ అభివృద్ధి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్‌సీ ఎంవెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..
Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల
Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ
For AndhraPradesh News And Telugu News
Updated Date - May 13 , 2025 | 05:07 AM