Nimmala Ramanaidu: రాష్ట్రాన్ని ఊడ్చేసి చిల్లికుండ చేతికి.. అయినా పనులు చేస్తున్నాం
ABN, Publish Date - May 15 , 2025 | 04:40 AM
మాజీ సీఎం జగన్ అధీనంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటున్నప్పటికీ, మంత్రి నిమ్మల రామానాయుడు చంద్రబాబును పరిపాలనా దక్షత కలిగిన నాయకుడిగా గుర్తించారు. కొండపల్లి మండలంలో బుడమేరు డైవర్షన్ చానెల్‌కు సంబంధించిన సేఫ్టీ వాల్ నిర్మాణం జూన్ 10 నాటికి పూర్తి చేయడానికి పనులు వేగంగా సాగుతున్నాయి.
తెస్తున్న డబ్బంతా జగన్ అప్పులకే సరి: నిమ్మల
ఇబ్రహీంపట్నం, మే 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని ఊడ్చేసి ఖాళీ చిల్లికుండను మాజీ సీఎం జగన్ తమ చేతికి ఇచ్చినా ఏదో ఒకటి చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఏదైనా ప్రజలకు చేయాలని రూ.10వేల కోట్లు అప్పు తెస్తే జగన్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకే అవి సరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొండపల్లి మున్సిపాలిటీ శాంతినగర్ వద్ద బుడమేరు డైవర్షన్ చానెల్‌కు గత ఏడాది వరదలకు ఏర్పడ్డ మూడు గండ్ల వద్ద యుద్ధ ప్రాతిపదికన పూడ్పించిన కట్టకు సమాంతరంగా సేఫ్టీ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వాటిని ఆయన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌తో కలిసి బుధవారం పరిశీలించారు. జగన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంత ముంచినా సరే పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబు ఉన్నారనే ధైర్యమే తమను, రాష్ట్ర ప్రజలను నిలబెడుతోందన్నారు. చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అండగా ఉన్నారని, ప్రధాని నరేంద్ర మోదీ సహకారం ఉందన్నారు. అందువల్లే సవాళ్లను అధిగమించి ముందుకు సాగగలుగుతున్నామని తెలిపారు. బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని, ఇందుకు కేంద్ర సాయం అవసరమన్నారు. ఇప్పుడున్న పరిస్థితులనుబట్టి రాష్ట్ర బడ్జెట్ ఒక్కటే సరిపోదని, రూ.28కోట్లతో మూడు గండ్లు పడిన చోట సుమారు 500 మీటర్ల పర్మినెంట్ సేఫ్టీ వాల్ నిర్మాణం జూన్ 10నాటికి పూర్తయ్యేలా యుద్ధ ప్రాతిపదినక పనులు సాగుతున్నాయని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News
Updated Date - May 15 , 2025 | 04:40 AM