ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్‌కు రైతులపై చిత్తశుద్ధి లేదు: మంత్రి మనోహర్‌

ABN, Publish Date - May 04 , 2025 | 06:02 AM

రైతులపై జగన్‌కు ఎప్పుడూ చిత్తశుద్ధి లేదని మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. ప్రభుత్వంగా రైతులకు తక్షణ ఆర్థిక మద్దతు అందించామని ఆయన వివరించారు

అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): ‘వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి రైతులపై ఎప్పుడూ చిత్తశుద్ధి లేదు. జగన్‌ పాలనలో రైతులకు రూ.1,674 కోట్లు చెల్లించకుండా పెట్టిన బకాయిలను మా కూటమి ప్రభుత్వం చెల్లించింది’ అని మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. రైతులకు మద్దతు ధర చెల్లించడం లేదని విమర్శిస్తూ శనివారం ఎక్స్‌ వేదికగా జగన్‌ చేసిన విమర్శలను మంత్రి తిప్పికొట్టారు. ‘ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 5.65 లక్షల మంది రైతుల నుం చి 35.94 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 24 గంటల్లో నే రూ.8,27.59 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. రబీ సీజన్‌లో 1,16,627 మంది రైతుల నుంచి 12.38 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 24 గంటల్లో రూ.2,722.81 కోట్లు జమ చేశాం. రైతుల కష్టానికి తక్షణ ఆర్థిక మద్దతు అందించాం’ అని మంత్రి మనోహర్‌ వివరించారు.

Updated Date - May 04 , 2025 | 06:02 AM