ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Nadendla Manohar : సోషల్‌ మీడియాలో దుష్ప్రచారాన్ని పట్టించుకోవద్దు!

ABN, Publish Date - Jan 27 , 2025 | 05:32 AM

జనసేన పార్టీ, కూటమి ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి పట్టించుకోవద్దని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి, జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సూచించారు.

  • పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌

  • జన సైనికుల కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ

మంగళగిరి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): ఈ మధ్య కాలంలో కొంతమంది మూర్ఖులు జనసేన పార్టీ, కూటమి ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి అనవసరమైన విషయాలను జనసైనికులు పట్టించుకోవద్దని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి, జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సూచించారు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యుల కుటుంబాలకు ఆదివారంమంగళగిరిలో ఆయన బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక నాయకుడికి దూరదృష్టి, ప్రణాళిక లేకపోతే ప్రజలు ఎంత నష్టపోతారో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తెలిసొచ్చిందన్నారు. కొంత మంది సోషల్‌ మీడియాలో పవన్‌ కల్యాణ్‌ గురించి, ఆయన పదవి గురించి మాట్లాడుతున్నారని, ఆయన ఏనాడూ పదవుల గురించి మాట్లాడలేదని, రాజకీయాల్లో మార్పు కోసం నిజాయితీ, నిబద్ధత, ధైర్యంతో నిలబడ్డారని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌.. జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి విలువలతో కూడిన రాజకీయాలు చేశారన్నారు. ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాలని సూచించారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 11.20 లక్షల సభ్యత్వాలు చేయగలిగామన్నారు. క్రియాశీల సభ్యులు పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేయాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!

Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల

Updated Date - Jan 27 , 2025 | 05:32 AM