ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Kollu Ravindra : మద్యం అక్రమాల్లో తాడేపల్లి ప్యాలెస్‌కు లక్ష కోట్లు

ABN, First Publish Date - 2025-02-20T04:53:33+05:30

మద్యం అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాల వల్లనే ప్రజలు 11 సీట్లు ఇచ్చారన్నారు.

  • విచారణకు సిట్‌ వేయగానే ఫైల్స్‌ దహనం

  • రెడ్‌బుక్‌ అంటేనే వైసీపీ నాయకులకు తడి సిపోతుంది

  • ఐదేళ్లూ జగన్‌ చేసిన దుర్మార్గాల వల్లనే 11 సీట్లు: కొల్లు

ఒంగోలు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో మద్యం అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించిన వెంటనే ఆ పార్టీ నేతలకు తడిసిపోతుందని, ప్యాలెస్‌ బయట ఫైళ్లు దహనమయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. మద్యం అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాల వల్లనే ప్రజలు 11 సీట్లు ఇచ్చారన్నారు. ఇంకా అలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో అవి కూడా రావని హెచ్చరించారు. మద్యం విధానంలో దందాలతో తాడేపల్లి ప్యాలెస్‌కు రూ.లక్ష కోట్లు నిధులు చేరాయన్నారు. సిట్‌ నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. రెడ్‌బుక్‌ పేరు వింటేనే వైసీపీ నాయకులకు తడిసిపోతుందని ఎద్దేవా చేశారు. మిర్చి యార్డు పర్యటన పేరుతో జగన్‌ కొత్త డ్రామాకు తెరతీశారని ధ్వజమెత్తారు. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో 14 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మంత్రి తెలిపారు.

Updated Date - 2025-02-20T04:53:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising