Mega DSC: డీఎస్సీలో మహిళా అభ్యర్థులే ఎక్కువ
ABN, Publish Date - May 17 , 2025 | 04:15 AM
మెగా డీఎస్సీకి 3,35,401 మంది దరఖాస్తు చేసుకున్నారు, అందులో మహిళలు పురుషులను దాట surpass చేసి 2,03,647 మంది ఉన్నారు. తొలిసారి ఎస్సీ వర్గీకరణ ఆధారంగా పోస్టులు కేటాయించారు. కర్నూలు జిల్లాలో అత్యధిక దరఖాస్తులు వచ్చాయి, నెల్లూరు జిల్లాలో అత్యల్పం.
16,347 పోస్టులకు 3,35,401 మంది పోటీ
వారిలో మహిళా అభ్యర్థులు2,03,647
అమరావతి, మే 16 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీకి దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. దరఖాస్తుదారుల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 16,347 పోస్టులకు.. 3,35,401 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 1,31,754 మంది పురుషులు, 2,03,647 మంది మహిళలు ఉన్నారు. అంటే పురుష అభ్యర్థుల కంటే మహిళలు 71,893 మంది అధికంగా ఉన్నారు. చాలా మంది ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయడంతో మొత్తం 5,77,417 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం పోస్టులు 16,347 కాగా డీఎస్సీని ఉమ్మడి జిల్లాల వారీగా ప్రకటించగా... కర్నూలు జిల్లాలో అత్యధికంగా 73,605 దరఖాస్తులు వచ్చాయి. ఈ జిల్లాలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 28,772 దరఖాస్తులు వచ్చాయి. ఇతర రాష్ట్రాల కోటాలో 7,159 మంది అభ్యర్థుల నుంచి 10,143 దరఖాస్తులు వచ్చాయి.
తొలిసారి ఎస్సీ వర్గీకరణ అమలు
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత తొలిసారి డీఎస్సీలోనే వర్గీకరణ ఆధారంగా పోస్టులు విభజించారు. నోటిఫికేషన్‌లో ఎస్సీ కేటగిరీ 1, 2, 3 పోస్టులు, అభ్యర్థులను వేర్వేరుగా చూపించారు. ఎస్సీ కేటగిరీ-1లో కొన్ని జిల్లాల్లో చాలా తక్కువ దరఖాస్తులు అందాయి. ఆ కేటగిరీలో ప్రకాశం జిల్లాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, చిత్తూరులో నలుగురు, కడపలో ఒకరు, అనంతపురంలో ఒకరు, కర్నూలులో నలుగురు అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News
Updated Date - May 17 , 2025 | 04:15 AM