ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Renewable energy: పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడులు

ABN, Publish Date - May 13 , 2025 | 04:09 AM

ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన రంగానికి రూ.22,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సోలార్‌, విండ్‌, బ్యాటరీ స్టోరేజ్‌ ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది.

17న పలు ప్లాంట్లకు లోకేశ్‌ భూమిపూజ

అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.22,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 2019-24 నడుమ ఈ రంగంలో రూపాయి కూడా పెట్టుబడి రాలేదు. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 1,800 మెగావాట్ల సోలార్‌ ఎనర్జీ ప్లాంటు, మరో 1,000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ (బీఈఎ్‌సఎ్‌స)తో కూడిన సోలార్‌ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు కొన్ని సంస్థలతో రాష్ట్ర పునరుత్పాదక ఇంధన సంస్థ ఒప్పందాలు చేసుకుంది. తాజాగా రెండు దశల్లో రెండు గిగావాట్ల బీఈఎ్‌సఎస్‌ ప్లాంట్లను ఆనంతపురం జిల్లాలో స్థాపించేందుకు ప్రతిపాదనలు వచ్చాయని రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్‌ అభివృద్ధి సంస్థ వెల్లడించింది. ఇందుకోసం 100 కిలోమీటర్ల మేర అదనపు హైవోల్టోజీ (ఈవీహెచ్‌) లైన్‌ ట్రాన్స్‌మిషన్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీన పలు పునరుత్పాదక ఇంధన ప్లాంట్లకు మంత్రి లోకేశ్‌ భూమి పూజ చేయనున్నారు. మొదటి దశలో 587 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌, 250.8 మెగావాట్ల విండ్‌ ప్రాజెక్టులను, 415 మెగావాట్ల బీఈఎ్‌సఎస్‌ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ రెన్యువల్‌ ఎనర్జీ పాలసీని రాష్ట్రప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఏసీఎంఈ సోలార్‌, రెన్యూ పవర్‌, గ్రీన్‌కో హోల్డింగ్‌, యాక్సిస్‌ విండ్‌ ఫర్మ్స్‌, అజూర్‌ పవర్‌, మైట్రాస్‌ వంటి సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి.


ఇవి కూడా చదవండి..

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 13 , 2025 | 04:09 AM