Masula Fest 2025: మంగినపూడి బీచ్‌కు పోటెత్తిన పర్యాటకులు
ABN, Publish Date - Jun 09 , 2025 | 04:24 AM
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన మసులా ఫెస్ట్-2025 ఆదివారంతో ముగిసింది. లక్షలాది మంది పర్యాటకులతో సముద్ర తీరం పోటెత్తింది.
ముగిసిన మసులా బీచ్ ఫెస్టివల్
మచిలీపట్నం టౌన్, జూన్ 8(ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన మసులా ఫెస్ట్-2025 ఆదివారంతో ముగిసింది. లక్షలాది మంది పర్యాటకులతో సముద్ర తీరం పోటెత్తింది. బీచ్ ఫెస్టివల్‌కు వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 15 లక్షల మంది తరలివచ్చినట్లు తెలుస్తోంది. చివరి రోజు జరిగిన కార్యక్రమంలో క్రీడాకారులకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు బహుమతులు అందజేశారు.
Updated Date - Jun 09 , 2025 | 04:26 AM