ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP liquor scam: లిక్కర్‌ బాసులు అరెస్టు

ABN, Publish Date - May 17 , 2025 | 03:42 AM

వైసీపీ పాలనలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు బెయిల్‌ నిరాకరణతో ధనుంజయ్‌, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు.

ధనుంజయ్‌ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అదుపులోకి

నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు.. లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక మలుపు

ఇద్దరూ జగన్‌ మనుషులే

మాజీ సీఎం కార్యదర్శిగా ధనుంజయ్‌రెడ్డి,

ఓఎస్డీగా కృష్ణమోహన్‌రెడ్డి స్కామ్‌లో భూమిక

అరెస్టు తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నం

హైకోర్టు, సుప్రీంకోర్టులో ఇద్దరికీ చుక్కెదురు

మూడోరోజు విచారణలో అదుపులోకి..

‘సిట్‌’ తర్వాతి అడుగు తాడేపల్లి వైపేనా?

అమరావతి, మే 16 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన భారీ లిక్కర్‌ స్కామ్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును చేపట్టినప్పటి నుంచి సిట్‌ సాగిస్తున్న అరెస్టుల పరంపరలో 2 పెద్ద వికెట్లు పడ్డాయి. వరుసగా 3 రోజులు రిటైర్డు ఐఏఎస్‌ అధికారి, జగన్‌ మాజీ కార్యదర్శి ధనుంజయ్‌ రెడ్డి, మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిని విచారించిన సిట్‌ అధికారులు, శుక్రవారం పొద్దుపోయాక వారిద్దరినీ అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ వేసిన వారిద్దరికీ అంతకుముందు సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. సిట్‌ విచారణలో ఉండగానే వారిద్దరి పిటిషన్‌ను కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. లిక్కర్‌ కేసులో అరెస్టును తప్పించుకోవడానికి ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి హైకోర్టు, సుప్రీంకోర్టుల దాకా వెళ్లి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో సిట్‌ అధికారులు కీలక నిర్ణయం తీసుకుని వారిని అదుపులోకి తీసుకొన్నారు. ఐదేళ్ల పాటు తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి రాష్ట్రమంతా చక్రం తిప్పిన వీరిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి కళ్లు, చెవుల్లాంటి ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్‌ బం ధించడంతో తాడేపల్లి ప్యాలె్‌సలో భూమి కంపించినట్లు అయింది.


సుప్రీంకోర్టు షాక్‌ ఇవ్వగానే..

మద్యం కుంభకోణంలో గుట్టుమట్లు లాగుతున్న సిట్‌ అధికారులు ఒక్కొక్క నిందితుడిని విచారించేక్రమంలో వెలికివచ్చిన అంశాలు, లభించిన ఆధారాలతో ముందుకెళ్లారు. లిక్కర్‌ స్కామ్‌లో ప్రతి అడుగులో కీలక భూమిక పోషించినట్టు నిర్ధారించుకుని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని ఈకేసులో నిందితులుగా చేర్చారు. మొత్తం కుట్రలో వీరు భాగస్వాములుగా మారారని సిట్‌ ఇప్పటికే కోర్టుకు తెలిపింది. స్కామ్‌లో కింగ్‌ పిన్‌ రాజ్‌ కసిరెడ్డి(ఏ1), వాసుదేవ రెడ్డి(ఏ2), విజయసాయి రెడ్డి(ఏ4), మిథున్‌ రెడ్డి(ఏ6)తో కలిసి అన్ని స్థాయిల్లోనూ సమావేశమై ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప (భారతి సిమెంట్స్‌ శాశ్వత డైరెక్టర్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్‌) చర్చలు జరిపారు. దీనిపై పక్కా ఆధారాలు సేకరించిన సిట్‌ అధికారులు వీరు ముగ్గురిని వరుసగా ఏ31, ఏ32, ఏ33గా నిందితుల జాబితాలో చేర్చారు. ఈ నెల 11న ఆదివారం ఉదయం విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌లోని సిట్‌ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా హైదరాబాద్‌లోని వీరి ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేశారు. అత్తాపూర్‌లోని ఉప్పరపల్లి సన్‌రైజ్‌ విల్లాలో ఉన్న కృష్ణమోహన్‌ రెడ్డి ఇంటికెళ్లి ఆయన లేకపోవడంతో కుమారుడు రోహిత్‌ రెడ్డి చేతికి ఇచ్చారు. ధనుంజయ్‌ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు, బాలాజీ గోవిందప్ప ఇంట్లోనూ అందజేసి వచ్చారు. అప్రమత్తమైన ముగ్గురూ మొదట హైకోర్టును ఆ తర్వాత సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఎలాంటి ఉపశమనం లభించలేదు. దీంతో సిట్‌ అధికారులు ఎప్పుడైనా అరెస్టు చేస్తారనే అనుమానం తో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో దాఖలు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నెల 11న విచారణకు వస్తారని ఎదురు చూసిన సిట్‌ అధికారులకు నిందితులు ముఖం చాటేశారు. ఈ నెల 13న సుప్రీం కోర్టులో ముందస్తు బెయి ల్‌ పిటిషన్‌పై విచారణ ఉన్నందున ము గ్గురూ ప్రణాళిక ప్రకారమే మాయమైనట్లు గుర్తించిన సిట్‌ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో వెతికారు. టెక్నాలజీ సాయంతో బాలాజీ గోవిందప్పను కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లాలోని బీఆర్‌ హిల్స్‌ లో 13న పట్టుకున్నారు. ఆయనను 14న విజయవాడకు తీస ుకొచ్చిన సిట్‌ అధికారులు కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇదిలాఉండగా ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల ముం దస్తు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు విన్న సుప్రీం కోర్టు తన నిర్ణయాన్ని శుక్రవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకూ అరెస్టు చేయవద్దంటూ సిట్‌ అధికారులకు సూచించింది. ఇద్దరూ విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో అప్పటివరకూ అజ్ఞాతంలో ఉన్న ధనుంజయ్‌ రెడ్డి, కృష్ణ మో హన్‌ రెడ్డి అనూహ్యంగా బుధవారం మధ్యాహ్నం విచారణకు వచ్చారు. గురువారం సుదీర్ఘంగా ప్రశ్నించినా ‘మాకెలాంటి సంబంధం లేదు.. మాకేమీ తెలీదు..’ అంటూ ఒకటే పాట పాడుతూ ఒక్క ప్రశ్నకూ సరైన సమాధానం ఇవ్వలేద ు. అయితే శుక్రవారం నాడు సుప్రీం కోర్టులో ఇద్దరికీ ఎదు రు దెబ్బ తగలడంతో సిట్‌ అధికారులు వీరిని అదుపులోకి తీసుకుంది. శనివారం వారిని కోర్టులో ప్రవేశపెట్టనుంది.


వైఎస్‌ నుంచి జగన్‌ దాకా..

నెల్లూరుకు చెందిన కృష్ణమోహన్‌ రెడ్డి....వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ(పుడా) కమిషనర్‌గా నియమితులయ్యారు. అక్కడ ఉండగానే వైఎస్‌ కుటుంబానికి బాగా దగ్గరయ్యారు. జగన్‌ కుటుంబానికి కట్టప్పగా పేరున్న కృష్ణమోహన్‌ రెడ్డి వీఆర్‌ఎస్‌ తీసుకుని వైఎస్‌ కుటుంబంలో ఒకరిగా మెలిగారు. వైఎస్‌ మరణం తర్వాత జగన్‌ చెంతకు ఆయన చేరారు. అక్రమాస్తుల కేసులో సీబీఐ జగన్‌ను అరెస్టు చేసి జైలుకు పంపినప్పుడు వైఎస్‌ విజయమ్మ వద్ద కృష్ణమోహన్‌రెడ్డి ఓఎస్డీగా పనిచేశారు. 2019 మార్చి 15 వేకువజామున మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మరణ వార్త జగన్మోహన్‌ రెడ్డికి చెప్పేందుకు ఎంపీ అవినాశ్‌రెడ్డి ఫోన్‌ చేసింది కృష్ణమోహన్‌ రెడ్డి నంబర్‌కే. కృష్ణమోహన్‌రెడ్డికి మద్యం ముడుపులు ఎక్కడికి చేరాయో తెలుసు. ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి సిట్‌ అధికారులు కస్టడీ పిటిషన్‌ వేయబోతున్నారు. కాగా, ధనుంజయ్‌రెడ్డికి జగన్‌ మనిషిగా పేరుంది. ఆయన మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారని సిట్‌ గుర్తించింది.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 03:42 AM