Lulu Group Investments: విశాఖలో అలా్ట్ర మోడరన్ మాల్ నిర్మిస్తాం
ABN, Publish Date - Jul 24 , 2025 | 02:50 AM
విశాఖలో అలా్ట్ర మోడరన్ షాపింగ్ మాల్ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కూడా అడుగు..
యూసుఫ్ అలీ, లులూ ఇంటర్నేషనల్ చైర్మన్
విశాఖలో అలా్ట్ర మోడరన్ షాపింగ్ మాల్ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కూడా అడుగు పెట్టి విజయవాడలో యూనిట్‌ను స్థాపించాలని భావిస్తున్నాం. ఏపీలో వివిధ పంటల ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విజనరీ లీడర్ చంద్రబాబు తమ రాష్ట్రానికి సంపద సృష్టికి, ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. దావోస్ పెట్టుబడుల సదస్సులో మొదటిసారి కలిసినప్పుడు విశాఖలో అలా్ట్ర మోడరన్ షాపింగ్ మాల్ నిర్మించాలని కోరారు. విశాఖలో మాల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అది ముందుకు సాగలేదు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చినందున త్వరలోనే విశాఖలో మాల్ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేస్తాం.
- యూసుఫ్ అలీ,
లులూ ఇంటర్నేషనల్ చైర్మన్
నమ్మకమైన భాగస్వామిగా ఏపీ
అగ్రిటెక్, ఫుడ్‌టెక్ రంగాల్లో పెట్టుబడులకు యూఏఈకి నమ్మకమైన భాగస్వామిగా ఏపీ ఉంటుంది. ఆక్వా ఉత్పత్తులతోపాటు పండ్ల ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్నాం. రాష్ట్రంలో 9 మెగా ఫుడ్ పార్క్‌లు ఉన్నాయి. 38 మిలియన్ల మంది నైపుణ్యమున్న మానవ వనరులున్నాయి. మొత్తంగా ఏపీ దేశానికే ఈస్ట్రన్ ఫుడ్ కారిడార్‌గా ఉంది.
- టీజీ భరత్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!
Updated Date - Jul 24 , 2025 | 02:50 AM