ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gulf Victim: లోకేశ్‌ చొరవతో గల్ఫ్‌ నుంచి స్వగ్రామానికి

ABN, Publish Date - Jun 08 , 2025 | 05:20 AM

మంత్రి లోకేశ్‌, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తనకు పునర్జన్మ ఇచ్చారని గల్ఫ్‌ బాధితురాలు ఆనందం వ్యక్తం చేసింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలోని..

  • మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు మహిళ పాలాభిషేకం

నల్లజర్ల, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): మంత్రి లోకేశ్‌, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తనకు పునర్జన్మ ఇచ్చారని గల్ఫ్‌ బాధితురాలు ఆనందం వ్యక్తం చేసింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలోని తన నివాసం వద్ద శనివారం మంత్రి లోకేశ్‌, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు చిత్రపటాలకు ఆమె పాలాభిషేకం చేసింది. గ్రామానికి చెందిన చిలకా నిర్మల ఉపాధి నిమిత్తం 16 నెలల కిందట గల్ఫ్‌ వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంది. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు ద్వారా విషయం తెలుసుకున్న లోకేశ్‌ కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడి ఆమె స్వదేశానికి రావడానికి ఏర్పాట్లు చేశారు. దీంతో నిర్మల గత నెల 27న ఇంటికి చేరగా, బంధువులు ఆసుపత్రిలో చేర్పించడంతో కోలుకుంది.

Updated Date - Jun 08 , 2025 | 05:22 AM