Vijay Sai Reddy: లిక్కర్ స్కామ్ దొంగల బట్టలు సగమే విప్పారు
ABN, Publish Date - Apr 23 , 2025 | 05:14 AM
లిక్కర్ స్కామ్‌లో తాను విజిల్ బ్లోయర్ అని, ఒక రూపాయి కూడా ముట్టలేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. దొంగల మిగిలిన బట్టలు విప్పేందుకు తాను సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
మిగతావీ విప్పేందుకు పూర్తిగా సహకరిస్తా : విజయసాయి
అమరావతి, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): లిక్కర్ స్కామ్ దొంగల బట్టలు (సిట్ అధికారులు) సగమే విప్పారని.. మిగతా బట్టలు విప్పేందుకు తాను పూర్తిగా సహకరిస్తానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. లిక్కర్ స్కామ్‌లో తనది విజిల్ బ్లోయర్ పాత్ర అని తెలిపారు. దొరికిన దొంగలు .. దొరకని దొంగలు.. ఇద్దరూ తన పేరును ఈ వ్యవహారంలో బయటకు లాగుతున్నారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. మద్యం వ్యవహారంలో రూపాయి కూడా తాను ముట్టలేదని విజయసాయి తెలిపారు.
Also Read:
కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..
చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 23 , 2025 | 05:14 AM