Liquor FIR Bomb: మద్యం కేసులో నిందితులుగా ఇద్దరు బాసులు
ABN, Publish Date - May 07 , 2025 | 04:04 AM
మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప పేర్లను సిట్ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న నలుగురు నిందితుల రిమాండ్ 20వ తేదీ వరకు పొడిగించారు
ఎఫ్‌ఐఆర్‌లో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి పేర్లు
భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప కూడా: సిట్ మెమో దాఖలు
కసిరెడ్డి, చాణక్య, సజ్జల, దిలీప్ రిమాండ్ పొడిగింపు
విజయవాడ, మే 6(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో కొత్తగా ముగ్గురు నిందితుల పేర్లను సిట్ అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. నాటి సీఎం కార్యదర్శి, ఐఏఎస్ అధికారి కె.ధనుంజయరెడ్డి, అప్పటి జగన్ ఓఎ్‌సడీ కృష్ణమోహన్‌రెడ్డితోపాటు భారతీ సిమెంట్స్ డైరెక్టర్‌గా ఉన్న బాలాజీ గోవిందప్ప పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చుతూ మంగళవారం ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోసం వారు సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కని సంగతి తెలిసిందే. కాగా, మద్యం కుంభకోణంలో అరెస్టయి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నలుగురు నిందితులు.. కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, చాణక్య, సజ్జల శ్రీధర్‌రెడ్డి, పైలా దిలీప్‌లకు రిమాండ్‌ను 20 వరకు పొడిగిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులిచ్చారు
Updated Date - May 07 , 2025 | 04:04 AM