ACB Court Verdict: లిక్కర్ నిందితుల కస్టడీ పిటిషన్‌పై తీర్పు 29కి రిజర్వు
ABN, Publish Date - May 27 , 2025 | 05:50 AM
మద్యం కుంభకోణంలో నిందితుల కస్టడీ పిటిషన్‌పై తీర్పును ఏసీబీ కోర్టు మే 29కు రిజర్వ్ చేసింది. పైలా దిలీప్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును మే 28కి వాయిదా వేసింది.
దిలీప్ బెయిల్‌పై తీర్పు రేపటికి వాయిదా
విజయవాడ, మే 26(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో నిందితులు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కె.ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి కస్టడీ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. తీర్పును ఈనెల 29కి న్యాయాధికారి పి.భాస్కరరావు రిజర్వ్ చేశారు. ఈ నలుగురు నిందితులను వారంపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా, మరో నిందితుడు పైలా దిలీప్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఏసీబీ కోర్టు ఈనెల 28కి వాయిదా వేసింది. ఆయన బెయిల్ పిటిషన్‌పై సోమవారం వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును న్యాయాధికారి పి.భాస్కరరావు వాయిదా వేశారు.
Updated Date - May 27 , 2025 | 05:52 AM