Controversy: సీతమ్మవారికి తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే
ABN, Publish Date - Apr 08 , 2025 | 11:08 AM
శ్రీరామనవమి సందర్భంగా విరూపాక్షి స్వగ్రామం చిప్పగిరిలోని కొండావీధిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి రాములోరి కల్యాణం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే హోదాలో విరూపాక్షి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా విరూపాక్షి చేతికి వేద పండితులు మంగళసూత్రాన్ని ఇవ్వగా… ఆయన దానిని సీతమ్మ మెడలో కట్టేశారు.
కర్నూలు జిల్లా: శ్రీరామ నవమి (Sri Rama Navami) వేడుకల్లో కర్నూలు జిల్లా, ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి (YCP MLA Virupakshi) తీరు వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే స్వగ్రామం చిప్పగిరిలో జరిగిన సీతారామ కల్యాణం (Sita Rami Kalyanam)లో వేదపండితులు సీతమ్మ (Sitamma) వారి మెడలో కట్టవలసిన మాంగల్యాన్ని (mangalya) ఎమ్మెల్యే విరూపాక్షి స్వయంగా కట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ (Videos Virul) కావడంతో హిందూ సంఘాల భక్తులు (Hindu community protest) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సంప్రదాయం ప్రకారం జరగకుండా ఈ విధంగా ఎలాచేస్తారని ప్రశ్నించారు.
సాయంత్రం వేళ ఈ వస్తువులు దానం చేయవద్దు..
దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఎమ్మెల్యే విరూపాక్ష స్పందించారు. మీడియా వేదికగా సంజాయిషీ ఇచ్చారు. తెలియక చేసిన తప్పు అని, పండితులు చెప్పిన ప్రకారం తాను చేశానని, ఉద్దేశపూర్వకంగా చేయలేదని చెప్పారు. సామాన్య భక్తుడిగానే గుడికి వచ్చారని, సీతారాముల కల్యాణం జరుగుతుండగా పండితుల సూచన మేరకు మాంగళ్యం సీతమ్మవారి మెడలో వేశానని సంజాయిషి ఇచ్చారు. ఇలా చేయడం తప్పేనని ఎమ్మెల్యే ఒప్పుకుంటూ క్షమాపణ చెబుతున్నట్లు ఓ వీడియో విడుదల చేశారు. దీంతో హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు శాంతించారు. ముందు ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలన్నారు. ఈ ఘటనపై విమర్శలు వస్తున్నప్పికీ మొత్తంగా ఈ విదాదం సద్దుమణిగింది.
వివరాల్లోకి వెళితే...
శ్రీరామనవమి సందర్భంగా విరూపాక్షి స్వగ్రామం చిప్పగిరిలోని కొండావీధిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి రాములోరి కల్యాణం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే హోదాలో విరూపాక్షి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా విరూపాక్షి చేతికి వేద పండితులు మంగళసూత్రాన్ని ఇవ్వగా… ఆయన దానిని సీతమ్మ మెడలో కట్టేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీతమ్మ మెడలో వేద పండితులు కట్టాల్సిన తాళిని విరూపాక్షి ఎలా కడతారంటూ పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విరూపాక్షి తాను చేసిన తప్పును తెలుసుకున్నారు. వెంటనే సారీ చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. తన వల్ల పొరపాటు జరిగిందని, ఈ పొరపాటుకు చింతిస్తున్నానని, ఈ ఘటన ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని ఆ వీడియోలో విరూపాక్షి చెప్పుకొచ్చారు. అయినా తాను కావాలని ఈ పని చేయలేదని, తన చేతికి మంగళసూత్రం ఇచ్చిన పండితులు చెబితేనే.. దానిని సీతమ్మ మెడలో వేశానంటూ ఆయన చెప్పుకొచ్చారు. మొత్తంగా ఎమ్మెల్యే విరూపాక్షి అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డంగా బుక్కయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భోజనం చివరిలో పెరుగు ఎందుకు తినాలంటే..
రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన
NTR వైద్యసేవా ట్రస్టు కింద వైద్య సేవలు పునఃప్రారంభం
For More AP News and Telugu News
Updated Date - Apr 08 , 2025 | 11:14 AM